Sekhar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం!
Shekar Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
Sekhar Master Bother Died: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నారు ఆయన. ఓ వైపు సినిమాలో కొరియోగ్రాఫీ చేస్తూనే డ్యాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పలు టీవీ షోలోనూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంట ఇటీవల శేఖర్ మాస్టర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు కన్నుమూశారు. ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
'నిన్ను మిస్ అవుతున్నాం సుధా. నేను ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా నువ్వే గుర్తోస్తావ్. నువ్వు చనిపోయావనే ఈ చేదు నిజాన్ని నేను జీర్ణించకోలేకపోతున్నా. ఎక్కడో ఓ చోట నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటున్నా. మమ్మల్ని గుర్తుచేసుకుంటూనే ఉంటావు. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావ్. మిస్ యూ రా తమ్ముడు' అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ఆయనపై పోస్ట్ యాంకర్ అనసూయ సందిస్తూ సంతాపం తెలిపారు.
View this post on Instagram
కాగా ఇటీవల శేఖర్ మాస్టర్ వదిన కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలో ఆయన తమ్ముడు చనిపోవడంతో ఆయన ఇంట వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ అగ్ర హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలకు వర్క్ చేస్తున్న శేఖర్ మాస్టర్ 'ఢీ' డ్యాన్స్ షోతో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టరగా కొనసాగుతున్నారు.
Also Read: బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం - గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌కి భారీ ఏర్పాట్లు, ఆహ్వాన పత్రిక చూశారా?