Nandamuri Balakrishna: బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం - గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌కి భారీ ఏర్పాట్లు, ఆహ్వాన పత్రిక చూశారా?
Nandamuri Balakrishna Completes 50 Years: నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన గోల్డెన్ జూబ్లీ వేడుకలకు భారీ ఏర్పాట్లకు సినీ పరిశ్రమ సిద్ధమవుతుంది.
Balakrishna Completes 50 Years in Film Industry: 'నటసింహం' నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తండ్రి నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీ పరిచయం అయ్యారు. బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించారు. ఇక కెరీర్ పరంగా ఎన్నో మైలురాళ్లు చేరారు. ఈ నందమూరి హీరో ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతోన్నారు. ఆగస్ట్ 30వ తేదీతో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు కావోస్తోంది.
ఈ సందర్భంగా బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ (Balakrishna Golden Jubliee) సెలబ్రేషన్స్ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మేరకు ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె.ఎల్ దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ దగ్గరుండి చూసుకుంటున్నారు.
ఇటీవల వారంత హైదరాబాద్ బాలయ్యను కలిసి సన్మాన వేడుక గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లకు అంగీకారం తెలుపాల్సిందిగా ఆయనను కోరారు. వారి విజ్ఞప్తి మేరకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో ఆయన సన్మాన వేడుకకు సంబంధించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన సన్మాక వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను (Golden Jubliee Invitation) ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో ఆయన సినీరంగానికి చేసిన విశేష సేవలను ప్రస్తావిస్తూ విడుదల చేశారు.
#50YearsofLegendNBKinTFI 🔥
— NBK UPDATES (@NbkUpdates) July 31, 2024
Official Invitation of Tollywood‘s Celebration of "Fifty Years of our #Natasimham Nandamuri Balakrishna garu💥🔥#NandamuriBalakrishna #GodofMassesNBK #NBK109 pic.twitter.com/cgKy6RoAOV
సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. కాగా బాలయ్య తన 50 సినీ ప్రస్థానంలో 109 సినిమాల్లో హీరోగా నటించారు.ఆయన సరసన సుమారు 129 మంది హీరోయిన్స్ ఆడిపాడారు. ఇండియన్ మూవీ హిస్టరీలో అత్యధిక మంది హీరోయిన్లతో నటించిన తొలి నటుడు ఈయనే కావడం విశేషం. ఆయన కెరీర్ పరంగా చూస్తే హిస్టారిక్, బయోపిక్స్, మైథాలాజికల్, సైన్స్ ఫిక్షన్, సోషల్ వంటి అన్ని జానర్లలో నటించి రికార్డు ఆయన ఖాతాలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించబోతోన్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ సినిమాలో ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నారు.
Also Read: రాజ్ తరుణ్ ప్రెస్‌మీట్‌లో తీవ్ర ఉద్రిక్తత - లోపలికి చొరబడేందుకు లావణ్య ప్రయత్నం