అన్వేషించండి

రాజ్ తరుణ్ ప్రెస్‌మీట్‌లో తీవ్ర ఉద్రిక్తత - లోపలికి చొరబడేందుకు లావణ్య ప్రయత్నం

ప్రసాద్ ల్యాబ్స్ ముందు రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారని తెలుసుకుని అక్కడికి వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంటగా నటించిన తాజా చిత్రం ‘తిరగబడరా సామి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరో, హీరోయిన్ పాల్గొన్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకుని లావణ్య అక్కడికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రాజ్ తరుణ్ ను కలవాలని గేటు దగ్గర గొడవ చేసింది. అయితే, ఆమెను పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. “నా మొగుడు రాజ్ తరుణ్ తో హీరోయిన్ ఎలా సహజీనం చేస్తుంది? అతడు తప్పు చేయకుంటే ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు?” అంటూ గొడవ చేసింది. అయితే, ఆమెను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లనివ్వలేదు. అయినా, ఆమె అక్కడి నుంచి వెళ్లకుండా ఆందోళన చేయడం  ఉద్రిక్తతకు దారి తీసింది.   

ఇంట్లో కూర్చొని బాధపడుతున్నా- రాజ్ తరుణ్

అటు ప్రెస్ మీట్‌లో లావణ్యతో వివాదానికి సంబంధించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు రాజ్ తరుణ్ సమాధానం చెప్పారు. ఈ వివాదం తన తర్వాతి సినిమాల మీద ఏమాత్రం ఉండబోదన్నారు. అయితే, ఈ వివాదం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టాన్ని కలిగించిందన్నారు. “రెమ్యునరేష్ అనేది సినిమా రిజల్ట్ ను బట్టి ఉంటుంది. నా నటన గురించి అందరికీ తెలుసు. పదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఎలాంటి వాడిని అని అందరికీ తెలుసు. సినిమాలకు సంబంధించి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, వ్యక్తిగతంగా నాకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. విమర్శలకు గురయ్యాను. ఈ వివాదం కారణంగా చాలా రోజులుగా ఇంట్లో కూర్చొని బాధ పడుతున్నాను. నాతోపాటు నా పేరెంట్స్ కూడా చాలా ఆవేదనకు గురయ్యారు. నేనే హైదరాబాద్ లోనే ఉన్నాను. ఎక్కడికి పారిపోలేదు. నా ఇమేజ్ కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే బయటకు రావడం లేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాల కంటే నా దగ్గర ఎక్కువ ఆధారాలున్నాయి” అని చెప్పుకొచ్చారు.

దయచేసి వ్యక్తిగత విషయాలు అడగకండి - రాజ్ తరుణ్

అటు మీడియా ప్రతినిధులు సినిమాకు సంబంధించి కాకుండా, పూర్తి స్థాయిలో లావణ్య వివాదంపై స్పందించడం పట్ల రాజ్ తరుణ్ అసహనం వ్యక్తం చేశారు. “సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో వ్యక్తిగత ప్రశ్నలు అడగకండి. పదే పదే నా వ్యక్తిగత విషయాలను చర్చకు పెట్టకండి. నా మీద వచ్చిన ఆరోపణలపై న్యాయపరంగా పోరాటం చేస్తున్నాను. నా మీద ఇప్పటి వరకు ఎవరూ చెడుగా మాట్లాడలేదు. తొలిసారి లావణ్య కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఆమె ఆరోపణలు అన్నీ అవాస్తవాలని త్వరలోనే తేలిపోతాయి” అని వెల్లడించారు.

Read Also: ‘కమిటీ కుర్రోళ్లు‘ వస్తున్నారు, బాబాయ్ బిజీ.. మా నాన్న దొరకడం లేదు: నిహారిక కొణిదెల

Also Read: అబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget