అన్వేషించండి

Niharika: ‘కమిటీ కుర్రోళ్లు‘ వస్తున్నారు, బాబాయ్ బిజీ.. మా నాన్న దొరకడం లేదు: నిహారిక కొణిదెల

నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కిన తాజాగా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు‘. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మెగా డాటర్ ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.

Niharika About Committee Kurrollu Movie:  మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు‘. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. యదు వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ప‌ద‌కొండు మంది హీరోలు, ఐదుగురు హీరోయిన్లుగా చేస్తున్నారు. వాళ్లంతా కొత్తవారే కావడం విశేషం. ఈ సినిమా ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఈ సినిమాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది.

కథ చెప్తూ తన ప్రపంచంలోకి తీసుకెళ్లారు - నిహారిక

దర్శకుడు వంశీ కథ చెప్పే విధానం అద్భుతంగా ఉందని నిహారిక చెప్పింది. ఆయన స్టోరీ చెప్పే విధానం తన తండ్రి నాగబాబుకు కూడా బాగా నచ్చిందని చెప్పింది. “ఇప్పటి వరకు కామెడీ, చిన్న చిన్న గొడవలకు సంబంధించిన కంటెంట్‌తో నిర్మాతగా వచ్చాను. తొలిసారి ఎక్కువ ఎమోషనల్, డ్రామాతో వస్తున్నాను. స్క్రిప్ట్ లు వింటుంటే వంశీ గారు వచ్చి ఇచ్చిన నరేషన్ బాగా నచ్చింది. చాలా అద్భుతంగా చెప్పారు. ఆయన కథ చెప్తూ తన ప్రపంచంలోకి తీసుకెళ్లారు. నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాన్న కూడా విన్నారు. రెండున్నర గంటల పాటు కొనసాగాల్సిన నరేషన్ ఐదున్నర గంటల పాటు కొనసాగింది. ఈ సినిమా విషయంలో నాన్న జోక్యం చేసుకోలేదు. నేను చేయాలి అనుకున్న తర్వాతే, నాన్నకు కథను వినిపించాను. మేం ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాం. స్టోరీ నరేషన్ చూసే తను ఓకే చెప్పేశారు” అని చెప్పుకొచ్చారు.

జాతర కథాంశంతో తెరకెక్కిన ‘కమిటీ కుర్రోళ్లు‘

‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా జాతర నేపథ్యంలో జరిగే పరిణామాలను బేస్ చేసుకుని నిర్మించినట్లు నిహారిక వెల్లడించింది. ఈ సినిమాలో క్యాస్ట్ పాలిటిక్స్ సహా చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నప్పటికీ, ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం. ఈ సినిమా చాలా వరకు కొత్త వాళ్లతోనే తెరకెక్కించాం. కథను బలంగా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే పాతవారిని తీసుకోలేదు” అని చెప్పారు. 

నా సినిమా ప్రమోషన్ టైంలో అందరూ మాయం అయ్యారు- నిహారిక

‘కమిటీ కుర్రోళ్లు‘ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా కష్టపడుతున్నట్లు నిహారిక తెలిపింది. “చరణ్ అన్న పారిస్ నుంచి రాగానే ఆయనతో ప్రమోషన్ చేయించాలి అనుకుంటున్నాం. బాబాయ్ చాలా బిజీగా ఉంటున్నారు. ఆయనను డిస్ట్రబ్ చేయాలి అనుకోవడం లేదు. పెద్దనాన్న ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాకు మా నాన్నే దొరకడం లేదు. మంగళగిరిలో రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అన్నయ్య వైజాగ్ లో షూటింగ్ లో ఉన్నారు. వదినకు కాలు ప్యాక్చర్ అయి డెహ్రాడూన్ లో ఉంది. పెదనాన్న ఫ్యామిలీ పారిస్ లో ఒలింపిక్స్ చూడ్డానికి వెళ్లారు. ఎవరూ దొరకడం లేదు. బాబాయ్ కి నేను సినిమా చేస్తున్నట్లు తెలుసు. ఆల్ ది బెస్ట్ చెప్పారు” అని వెల్లడించింది.

Also Readఅబ్బబ్బా అనసూయ... ముద్దులు ఎక్కడ ఇస్తావ్ రీతూ... శ్రీముఖి మాటల్లో డబుల్ మీనింగ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget