Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?
అందరూ అనుకున్నట్లుగానే లావణ్య, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లావణ్య ఓ క్యాప్షన్ పెట్టింది. ఆ క్యాప్షన్ వెనుక పెద్ద కథే ఉన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో ఈ వేడుక జరిగింది. అట్టహాసంగా నిర్వహించిన ఈ ఎగేజ్మెంట్ లో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీలు నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
లావణ్య క్యాన్షన్ వెనుకున్న అసలు కథ ఏంటంటే?
వాస్తవానికి లావణ్య, వరుణ్ తేజ్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి గురించి పలు డేటింగ్ రూమర్స్ కూడా వచ్చాయి. కానీ, కొణిదెల ఫ్యామిలీ గానీ, వరుణ్ తేజ్, లావణ్య గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం నాగబాబు, వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు సూచనప్రాయంగా ధృవీకరించారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే, లావణ్య తన ఎంగేజ్మెంట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పోస్ట్ చేసి, “2016♾️❤️” అనే క్యాప్షన్ పెట్టింది. అంటే, 2016 నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని ఆమె అధికారికంగా వెల్లడించింది.
View this post on Instagram
చాలా కాలంగా ప్రేమలో మునిగితేలుతున్న లావణ్య, వరుణ్
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమా 2017లో విడదల అయ్యింది. 2016లో ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచే లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున' సెట్స్ మీద ఉంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు.
Read Also: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ బ్యూటీ, నెట్టింట్లో ఫోటోలు వైరల్