Nagarjuna: 'కుబేర'లో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది? కాంట్రవర్సీకి చెక్ పెట్టిన కింగ్ నాగార్జున
Kuberaa Success Meet: 'కుబేర'లో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది? ధనుష్ లేదా నాగర్జున... ఇద్దరిలో హీరో ఎవరు? నాగార్జున మాటల తర్వాత మొదలైన కాంట్రవర్సీకి ఆయనే చెక్ పెట్టారు.

'కుబేర' ఎవరి సినిమా? ధనుష్ సినిమానా? కింగ్ అక్కినేని నాగార్జున సినిమానా? 'కుబేర'లో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది? సోషల్ మీడియా దీని మీద పెద్ద చర్చ జరుగుతోంది. అందుకు కారణం నాగార్జున మాటలే. నాగార్జున దృష్టి వరకు ఆ వివాదం వెళ్లడంతో ఆయనే కాంట్రవర్సీకి చెక్ పెట్టారు.
కాంట్రవర్సీకి నాగార్జున కారణమా? ఎలా?
సినిమా విడుదలైన తర్వాత రోజు 'కుబేర' టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. అందులో నాగార్జున ''కథ విన్న తర్వాత నాది మెయిన్ క్యారెక్టర్ అనిపించింది. కథలోని ప్రతి పాత్ర నా చుట్టూ తిరుగుతుంది. కొన్ని క్యారెక్టర్ల స్క్రీన్ టైం ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇది దీపక్ సినిమా. శేఖర్ కమ్ముల కూడా నాకు అలాగే కథ చెప్పాడు'' అని అన్నారు
నాగార్జున మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా విడుదలకు ముందు ఆయన చెప్పిన మాటలను కొందరు గుర్తు చేశారు. థియేటర్లలోకి 'కుబేర' రావడానికి ముందు 'ఇది శేఖర్ కమ్ముల సినిమా' అని చెప్పారని, సినిమా విడుదలైన తర్వాత సక్సెస్ టాక్ వచ్చిన తర్వాత తన సినిమా అంటున్నారని నాగార్జున మీద కొందరు విమర్శలు చేశారు. అవి ఆయన దృష్టి వరకు వెళ్లాయి. దాంతో సక్సెస్ మీట్‌లో వివాదానికి ఆయన చెక్ పెట్టారు.
ఇది దేవా సినిమా... దీపక్ సినిమా...
అన్నిటికీ మించి శేఖర్ కమ్ముల సినిమా!
తన మాటలను బేస్ చేసుకుని కొందరు మీమ్స్ వేశారని చెప్పారు నాగార్జున. తన మాటలతో వివాదాన్ని సృష్టించారని గుర్తు చేస్తారు. ''నేను మళ్లీ చెప్తున్నా... ఇది దేవా సినిమా... ధనుష్ సినిమా కాదు. ఇది దీపక్ సినిమా... నాగార్జున సినిమా కాదు. ఇది సమీరా సినిమా. ఇది ఖేలు సినిమా. ఇది కుష్బూ సినిమా. అన్నిటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా'' అని వివాదానికి చెక్ పెట్టేశారు.
నాగార్జునకు రెస్పెక్ట్ ఇచ్చిన ధనుష్...
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్!
'కుబేర' సక్సెస్ మీట్‌లో ధనుష్ కంటే ముందు నాగార్జునను స్టేషన్ మీదకు ఇన్వైట్ చేశారు యాంకర్. అయితే వెంటనే ధనుష్ లేచి స్టేజి మీదకు వెళ్లారు. తాను మాట్లాడిన తర్వాత నాగార్జున గారు మాట్లాడటమే కరెక్ట్ అన్నారు. నాగ్ వంటి సీనియర్ హీరోకు ఆయన ఇచ్చిన రెస్పెక్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: 'పుష్ప' నిర్మాతలను టార్గెట్ చేసిన దేవి శ్రీ ప్రసాద్? 'కుబేర' సక్సెస్ మీట్‌లో సెటైర్ వాళ్ళ మీదేనా?
నాగార్జున కంటే ముందు స్టేజి మీద ధనుష్ మాట్లాడటం మాత్రమే కాదు... సక్సెస్ మీట్‌లో చిరంజీవి పాదాలకు నమస్కరించడం, అలాగే తోట తరణి పాదాలకు సైతం నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం పెద్దలకు ఆయన ఇచ్చే గౌరవం అందరికీ తెలిసేలా చేసింది.
Also Read: బీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి





















