Devi Sri Prasad: 'కుబేర' సక్సెస్ మీట్‌లో దేవి శ్రీ ప్రసాద్ సెటైర్... 'పుష్ప' నిర్మాతలను టార్గెట్ చేశారా?
Kuberaa Success Meet: 'కుబేర' విడుదలకు ముందు మొత్తం పేమెంట్ వచ్చేసిందని దేవి శ్రీ ప్రసాద్ సక్సెస్ మీట్‌లో చెప్పారు. ఆయన నవ్వుతూ సరదాగా మాట్లాడినా... 'పుష్ప 2' నిర్మాతలపై సెటైర్ అని ఇండస్ట్రీ టాక్.

'కుబేర' విడుదలకు ముందు నిర్మాతలు తనకు మొత్తం పేమెంట్ ఇచ్చేశారని సక్సెస్ మీట్‌లో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) తెలిపారు. అది కూడా కాస్త వ్యంగ్యంగా! స్టేజి మీద సెటైరికల్ స్టెప్ వేశారు. డీఎస్పీ సరదాగా నవ్వుతూ చెప్పినప్పటికీ... 'పుష్ప 2' నిర్మాతలపై ఆయన సెటైర్ వేశారని ఇండస్ట్రీలో చాలా మంది భావిస్తున్నారు.
సక్సెస్ మీట్‌లో దేవిశ్రీ ఏమన్నారు?
'కుబేర' చూసిన ప్రేక్షకులు సినిమాలో ధనుష్ - నాగార్జునల నటన, శేఖర్ కమ్ముల దర్శకత్వం గురించి ఎంత మాట్లాడుతున్నారో... అంతకు మించి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. పాటల్లో గానీ, నేపథ్య సంగీతంలో గానీ డీఎస్పీ రెగ్యులర్ మార్క్ లేదనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అదే సమయంలో కథకు తగ్గట్టు, ఆ కథలోని క్యారెక్టర్లు - సన్నివేశంలో గాఢత ప్రేక్షకులకు చేరువ అయ్యేలా అత్యద్భుతమైన కొత్త తరహా నేపథ్య సంగీతం అందించారని అందరూ చెబుతున్నారు. తనకు లభిస్తున్న ప్రశంసల గురించి 'కుబేర' సక్సెస్ మీట్‌లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడారు.
''సినిమా విడుదలకు ముందు మొత్తం పేమెంట్ వచ్చేసింది. ఇంత కంటే ఆనందం ఏముంది? ఒక మంచి సినిమా. కొత్త కథ, కొత్త రకమైన మ్యూజిక్. పైగా మ్యూజిక్ బాగా చేశానంటున్నారు. పైగా రీ రికార్డింగ్ కూడా బాగా చేశానంటున్నారు. అదేంటో?'' అని దేవి శ్రీ ప్రసాద్ అన్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మాటల్లో సెటైర్ ఏముంది?
'పుష్ప 2' నిర్మాతలను నిజంగా టార్గెట్ చేశారా?
'పుష్ప 2 ది రూల్' విడుదల ముందు తెర వెనుక చాలా అంటే చాలా వ్యవహారాలు జరిగాయి. ఒక దశలో దేవి శ్రీ ప్రసాద్‌ను తప్పించి వేరే సంగీత దర్శకులు దగ్గరకు రీ రికార్డింగ్ చేయమని వెళ్లారు. తమన్ అయితే తాను పుష్ప 2 రీ రికార్డింగ్ చేస్తున్నానని స్టేజి మీద చెప్పారు. చివరకు ఆయన చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసుకోలేదనుకోండి. ఆ తర్వాత తమిళ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ చేత కొంత వర్క్ చేయించారు.
Also Read: 'ఈగ'ను కాపీ చేశారు... మలయాళ సినిమాకు రాజమౌళి నిర్మాత కాపీరైట్ నోటీసులు
తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో 'పుష్ప 2 ది రూల్' 90 శాతం నేపథ్య సంగీతం తాను చేసిందేనని సామ్ సిఎస్ తెలిపారు. టైటిల్ క్రెడిట్స్‌లో అతడికి అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్రెడిట్ ఇచ్చారు. ఇక 'పుష్ప 2 ది రూల్' ప్రీ రిలీజ్ వేడుకలో మనకు రావాల్సిన డబ్బులు అయినా క్రెడిట్ అయినా అడిగి తీసుకోవాలని దేవి శ్రీ ప్రసాద్ కామెంట్ చేశారు. అప్పట్లో నిర్మాతలతో ఆయనకు పడలేదని వార్తలు వచ్చాయి.
'కుబేర' సినిమా విడుదలకు ముందు ఇటువంటి వ్యవహారాలు ఏమి జరగలేదు. దేవి పాటలు లేటుగా ఇచ్చారని విమర్శ ఉన్నప్పటికీ... ప్రతి పాట, ప్రతి సన్నివేశంలో నేపథ్య సంగీతం అతనిదేనని ఒప్పుకోక తప్పదు. సినిమా నిడివి విషయంలో విమర్శలు వచ్చాయేమో గాని దేవి శ్రీ ప్రసాద్ సంగీతం విషయంలో ఒక కంప్లైంట్ కూడా లేదు. అందరూ ఆయన్ను అభినందించారు. 'మ్యూజిక్ బాగుంటుందంటున్నారు. అదేంటో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుందంటున్నారు' అంటూ 'పుష్ప 2' నిర్మాతలకు తగిలేలా డీఎస్పీ సెటైర్స్ వేశారనేది ఇండస్ట్రీ ఫీలింగ్.
తనకు ఇవ్వవలసిన క్రెడిట్ విషయంలో ఎవరైనా ఎక్కువ తక్కువ చేస్తే స్టేజ్ మీద ఇచ్చి పడేయడం దేవి శ్రీకి అలవాటు. అప్పట్లో ఒకసారి దేవి శ్రీ ప్రసాద్ నుంచి పిండి మ్యూజిక్ తీసుకున్నానని బోయపాటి శ్రీను కామెంట్ చేస్తే... అదే స్టేజి మీద తాను ఏమైనా ఆవునా పాలు పిండటానికి అని రిప్లై ఇచ్చారు. 'కుబేర' స్టేజి మీద కథ బావుంది గనుక మంచి మ్యూజిక్ ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తీసే సినిమాకు దేవి శ్రీని సంగీత దర్శకుడుగా తీసుకుంటారా? లేదా? వెయిట్ అండ్ సి. ఎందుకంటే... ఆ సినిమాకూ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మాతలు.
Also Read: బీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి





















