అన్వేషించండి

Jayasudha: ఆ రోజు మేం వెళ్తున్న కారు ఆగిపోయింది, వెంటనే బాలకృష్ణ అలా హెల్ప్ చేశారు - జయసుధ

Jayasudha: ఒకప్పటి హిట్ పెయిర్స్‌లో జయసుధ, బాలకృష్ణ కూడా ఒకరు. ఇప్పటికీ వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలకృష్ణ మనస్తత్వం గురించి చెప్తూ ఒక సంఘటనను బయటపెట్టారు జయసుధ.

Jayasudha About Balakrishna: నటిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూశారు జయసుధ. తన వ్యాపారాల్లో నష్టాలు రావడం, దానివల్ల భర్త చనిపోవడం.. ఇలా ఎన్నో సంఘటనలను ఆమె ధైర్యంగా ఎదుర్కున్నారు. అయితే తాము స్టార్లు అనే విషయం పక్కన పెడితే ప్రతీ సమస్యకు ఒక సింపుల్ పరిష్కారం కూడా ఉంటుందని జయసుధ చెప్పుకొచ్చారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధ తాను జీవితంలో ఎదుర్కున్న కొన్ని బాధాకరమైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. బాలకృష్ణతో జరిగిన ఒక సంఘటనను బయటపెట్టారు. ఆయన ఎంత సింపుల్‌గా ఉంటారో చెప్పారు.

ఆ ఈవెంట్ కోసమే..

ఇండియన్ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పట్లో దాదాపు ప్రతీ ఇండియన్ భాషా ఇండస్ట్రీలో గ్రాండ్‌గా వేడుకలు జరిగాయి. అలాగే సౌత్‌లో కూడా జరిగాయి. జయసుధ దాదాపు ప్రతీ సౌత్ భాషలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆమె చెన్నై, హైదరాబాద్.. రెండు చోట్ల జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. ముందుగా చెన్నైలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా మూమెంటమ్ కూడా తీసుకున్నారు. ఇదే విషయాన్ని జయసుధ గుర్తుచేసుకున్నారు. అయితే చెన్నైలో ఆ ఈవెంట్‌ అయిపోయిన రెండు రోజుల తర్వాత తెలుగులో కూడా అదే వేడుక జరిగిందని, దానికి హాజరైనప్పుడు ఎదుర్కున్న ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు.

కార్ల వల్ల ఇబ్బంది..

‘‘ఈవెంట్ అయిపోయి బయటికి వచ్చేసరికి నెహ్రూ స్టేడియంలో కార్లు ఎక్కడికక్కడ జామ్ అయిపోయాయి. ఈవెంట్ వాళ్లే మాకు కార్లు ఏర్పాటు చేశారు. నేను, జయప్రధ మా కార్ల కోసం ఎదురుచూస్తున్నాం. డ్రైవర్లకు ఫోన్ చేసినా కూడా వాళ్లు కార్లు ఎక్కడ పెట్టారో తెలియక వెతుకుతున్నారు. అంతలోపు బాలకృష్ణ వచ్చారు. తనకు కూడా కారు లేదు. కాసేపటికి ముగ్గురిలో ఎవరో ఒకరి కారు వచ్చింది. ఎవరిది తెలీదు కానీ ఎక్కేశాం. ఎక్కి కొంచెం దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోయింది. హోటల్‌కు వెళ్లాలి. అక్కడే ఆటో ఉంటే.. బాలకృష్ణ ఆ ఆటో ఆపారు. నేను, జయప్రధ, ఆయనతో పాటు ఆటో ఎక్కాం’’ అంటూ అప్పటి ఫన్నీ సంఘటనను గుర్తుచేసుకున్నారు జయసుధ.

సర్దుకుపోవాలి..

తాము పెద్ద స్టార్లు అనుకొని ఉండుంటే ఆటో ఎక్కేవాళ్లం కాదని, కానీ అలా అనుకోవడం అనవసరమని చెప్పుకొచ్చారు జయసుధ. పెద్ద స్టార్లు అయినా కూడా అప్పుడప్పుడు సర్దుబాటు చేసుకుంటూ ఉండాలని సలహా ఇచ్చారు. ఆఖరికి షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలకే ఎయిర్‌పోర్టులో ఇబ్బందులు ఎదురయ్యాయని ఉదాహరణగా చెప్పారు. జయసుధ, బాలకృష్ణ కలిసి ఎన్నో సినిమాలు నటించారు. ఒకప్పుడు ఆయన పక్కనే హీరోయిన్‌గా నటించిన జయసుధ.. ఇప్పుడు ఆయన సినిమాల్లోనే తల్లి పాత్రలు కూడా చేస్తున్నారు. ఒకప్పటి టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో వీరు కూడా ఒకరు. పొలిటీషియన్ అయినా కూడా సినిమాలను పక్కన పెట్టకుండా ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు జయసుధ.

Also Read: నేను రవి కిషన్ కూతురిని, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి - ‘రేసు గుర్రం’ విలన్‌పై ఆరోపణలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Embed widget