Image Source: pexels

ఈ కూరగాయలను.. తొక్క తీయకుండానే తినాలి

కొన్ని రకాల కూరగాయలు తొక్క తీయకుండానే వండాలి. అవేంటో చూద్దామా!

క్యారెట్ పీల్ తీయకూడదు. తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దోసకాయ తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కే వంటి పోషకాలు ఉంటాయి. దీన్ని తొక్కతోనే తినాలి.

గుమ్మడికాయ తొక్క ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి.

బంగాళదుంప తొక్కలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తొక్కతోనే ఉడికించుకోవాలి.

వంకాయ కూడా పొట్టుతోనే వండుకోవాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

కొన్ని కూరగాయలను పొట్టుతోనే తింటే అందులోని పోషకాల ప్రయోజనాలన్నీ పొందవచ్చు.

Image Source: pexels

పురుగుల మందులను పిచికారి చేసిన కూరగాయలను ముందుగా వాటిని బాగా కడిగిన తర్వాతే వండుకోవాలి.