చన్నీటి స్నానంతో శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా పోషకాలు, ఆక్సిజన్ శరీర కణాలకు ఎక్కువగా అందుతాయి. చన్నీటి స్నానం ఇమ్యూనిటి పెంచుతుంది. ఫలితంగా త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. చన్నీటి స్నానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ బావుంటుంది. చన్నీటి స్నానం వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా అవుతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జుట్టు మొదళ్లు కూడా బిగుతుగా మారుతాయి. జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది. చన్నీటి స్నానం బ్రౌన్ ఫ్యాట్ ను ఆక్టివేట్ చేస్తుంది. అందువల్ల శరీరంలో క్యాలరీస్ ఖర్చుచేసే వేడి పుడుతుంది. చన్నీటి స్నానం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. వర్కవుట్ తర్వాత వచ్చే అలసట తీరుతుంది. చన్నీటితో శరీరానికి ఒక షాక్ తగులుతుంది. దానితో గుండె వేగం, శ్వాస రేటు పెరుగుతుంది. ఇది మిమ్మల్ని చురుకుగా చేస్తుంది. చన్నీటి స్నానంతో శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దానితో మెదడుకు నిద్ర సమయమనే సంకేతాలు వెళ్తాయి. అందువల్ల మంచి నిద్ర వస్తుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.