బీట్ రూట్‌లో ఐరన్ ఎక్కువ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఐరన్ స్థాయిలు పెరుగుతాయి. బీట్ రూట్‌లో డీటాక్స్ చేసే సమ్మేళనాలు ఉంటాయి. కనుక చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. బీయ్యం నీళ్లు యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటాయి. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. బియ్యం నీళ్లతో చర్మం కాంతి సంతరించుకుంటుంది. ఇనోసిటాల్ వంటి సమ్మేళనాలు ఉండడం వల్ల మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆలోవెరా జెల్ సూటయ్యే వారు దీన్ని క్రమం తప్పకుండా చర్మం మీద ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది. సన్ బర్న్ అయినపుడు చర్మం మీద ఆలోవెరా రాసి బ్యాండెజ్ వేస్తే త్వరగా కోలుకుంటుంది. క్రమం తప్పకుండా బీట్ రూట్ పొడి వాడితే నల్లమచ్చలు పలుచబడుతాయి. విటమిన్ Cతో చర్మం కాంతివంతం అవుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.