By: ABP Desam | Updated at : 24 Mar 2022 12:53 PM (IST)
'గని'లో తమన్నా
Ghani Movie Update: వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. జీవితంలో బాక్సింగ్ చేయమని తల్లికి ప్రామిస్ చేసిన ఓ పిల్లాడు... తల్లికి తెలియకుండా బాక్సింగ్ ఎందుకు చేశారు? నేషనల్ ఛాంపియన్ కావాలని ఎందుకు అనుకున్నాడు? నేషనల్ ఛాంపియన్ అయిన రోజే తన తల్లికి నిజం తెలియాలని ఎందుకు అనుకున్నాడు? అతని తండ్రి విక్రమాదిత్య ఎవరు? అనేది కథ. ట్రైలర్ లో ఈ విషయాలు చెప్పారు. కథగా సీరియస్ గా ఉందని అనుకుంటున్నారా? ఇందులో లవ్ ట్రాక్ ఉంది. ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది.
'గని'లో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'కొడితే...' అంటూ సాగే ఆ గీతాన్ని రెండు నెలల క్రితమే విడుదల చేశారు. ఈ రోజు వీడియో సాంగ్ విడుదల చేశారు. తమన్నా గ్లామర్, డాన్స్ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. తమన్ సంగీతంలో హారికా నారాయణ్ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ పాటను కూడా బాక్సింగ్ రింగ్ లో షూట్ చేశారు.
కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు. ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: లేటు వయసులో 'లా' - పుస్తకాలు పట్టిన పూజా హెగ్డే తల్లి
The sizzling #Kodthe video song from #Ghani is out now! 💃🥊
— Geetha Arts (@GeethaArts) March 24, 2022
- https://t.co/jNz52OMq10
A @MusicThaman Musical 🎹
📝 @ramjowrites
🎤 @HarikaNarayan #GhaniFromApril8th @IAmVarunTej @tamannaahspeaks @saieemmanjrekar @dir_kiran @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/AzY48Jh8z2
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా