అన్వేషించండి

Entertainment Top Stories Today: విశ్వం, జిగ్రా రివ్యూస్ నుంచి నిఖిల్ కొత్త సినిమా టీజర్, శృతి కంప్లైంట్ వరకు... నేటి టాప్ సినీ న్యూస్

Entertainment News Today In Telugu: విజయదశమి కానుకగా విడుదలైన కొత్త సినిమాలు ఎలా ఉన్నాయి? నిఖిల్ కొత్త సినిమా టీజర్ ఎలా ఉంది? అనేది నేటి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ న్యూస్‌లో చూడండి.

విజయ దశమి సందర్భంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ రోజు పలు చిత్రాలు విడుదల అయ్యాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోపీచంద్ 'విశ్వం', ఆలియా భట్ 'జిగ్రా'. ఈ సినిమాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు విడుదలైన నిఖిల్ కొత్త సినిమా టీజర్ ఎలా ఉంది? ఇండిగో ఎయిర్ లైన్స్ మీద నిన్ను శృతిహాసన్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా కబురు ఏంటి?

శ్రీను వైట్లకు విజయం వచ్చిందా? గోపీచంద్ విశ్వం ఎలా ఉంది?
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'విశ్'వం సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. వరుస పరాజయాలతో ఆరేళ్లుగా దర్శకత్వానికి దూరంగా ఉన్న శ్రీను వైట్ల,‌‌ ఇటీవల సరైన విజయాలు లేని గోపీచంద్ కలిసి ఎటువంటి సినిమా తీశారు? అనేది రివ్యూలో చూడండి
(విశ్వం రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

యాక్షన్ బాట పట్టిన ఆలియా‌ భట్... జిగ్రా బాగుందా?
త్రిబుల్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ భామ ఆలియా భట్. హిందీలోనూ ఆవిడ పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు చేశారు. ఫస్ట్ టైం అలియా భట్ యాక్షన్ రోల్ చేసిన సినిమా 'జిగ్రా'. విజయ దశమి సందర్భంగా ఈ రోజు హిందీ తో పాటు తెలుగులోని విడుదల అయింది‌. ఈ సినిమా బాగుందా లేదా రివ్యూ చదివి తెలుసుకోండి. 
(ఆలియా భట్ జిగ్రా రివ్యూ చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

సిద్దు జొన్నలగడ్డ హీరోగా మైథలాజికల్ డ్రామా!
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలిసి ఓ భారీ మైథలాజికల్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కే ఆ సినిమాలో సిద్ధూ మహారాజా పాత్రలో కనిపిస్తారని సమాచారం. (ఆ సినిమా కోసం వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అంటూ టీజర్‌తో వచ్చిన నిఖిల్!
యువ కథానాయకుడు నిఖిల్, దర్శకుడు సుధీర్ వర్మలది సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా 'స్వామి రారా'కు తెలుగు నాట చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన 'కేశవ' కూడా కొంత మందిని ఆకట్టుకుంది. కొంత విరామం తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కలిపి చేసిన సినిమా 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేశారు. ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అది ఎలా ఉందో చూడండి.
(అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్ చూడటంతో పాటు రిలీజ్ డేట్ తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

ముంబై ఎయిర్ పోర్టులో నాలుగు గంటలు నరకయాతన
ముంబై నుంచి తాను ప్రయాణించాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడం పట్ల హీరోయిన్ శృతి హాసన్ సీరియస్ అయ్యింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఎయిర్ పోర్టులో ప్రయాణీకులను పడిగాపులు కాసేలా చేశారంటూ మండి పడింది. శృతి హాసన్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ పట్ల ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ స్పందించింది. 
(శృతి హాసన్ ఏం ట్వీట్ చేశారు? ఇండిగో ఎయిర్ లైన్స్ ఏం చెప్పింది? అనేది తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Embed widget