![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Siddu Jonnalagadda: వెంకీ అట్లూరి కాదు... మరో దర్శకుడితో భారీ మైథాలజీ సినిమా ప్లాన్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ
Siddu Jonnalagadda Next Movie: 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న సిద్ధూ జొన్నలగడ్డ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. వీటి తర్వాత ఆయన మైథాలజీ సినిమా ప్లాన్ చేశారు.
![Siddu Jonnalagadda: వెంకీ అట్లూరి కాదు... మరో దర్శకుడితో భారీ మైథాలజీ సినిమా ప్లాన్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ Siddu Jonnalagadda next movie directed by Ravikanth Perepu is a mythological backdrop entertainer Siddu Jonnalagadda: వెంకీ అట్లూరి కాదు... మరో దర్శకుడితో భారీ మైథాలజీ సినిమా ప్లాన్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/11/0c4fc159d77c5dc694b42f33d21583331728608584968313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఇప్పుడు హిస్టారికల్, మైథాలజీ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ చాలా బావుంది. పాన్ ఇండియా లెవెల్ సక్సెస్ కొట్టడానికి... భాషలకు అతీతంగా ప్రేక్షకులు అందరిని మెప్పించడానికి ఆ జానర్ సినిమాలు అయితే బెటర్ ఆప్షన్. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) సైతం ఇప్పుడు ఓ మైథాలజీ సినిమా చేయడానికి రెడీ అయ్యారు.
వెంకీ అట్లూరి దర్శకుడు కాదు... మరి ఎవరు?
సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందనున్న భారీ మైథాలజీ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే... ఆ వార్తల్లో నిజం లేదు. సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి కాదు. 'క్షణం' వంటి థ్రిల్లర్ తీసి మాంచి హిట్ అందుకున్న రవికాంత్ పేరేపు (Ravikanth Perepu) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
సితార సంస్థలో సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్!!
సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా రవికాంత్ పేరుకు దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' తర్వాత నిర్మాతలతో సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ చిత్రమిది. విజయ దశమి కానుకగా ఇవాళ లేదంటే రేపు ఈ సినిమాను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
This Dussehra, get ready for the biggest historic claim yet! 💥
— Sithara Entertainments (@SitharaEnts) October 10, 2024
THE KING WILL BRING IT BACK! 🔥@SitharaEnts @Vamsi84 @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/vbMCkyAlhn
మైథాలజీ... మహారాజు పాత్రలో స్టార్ బాయ్ సిద్ధూ!
ఇప్పటి వరకు సిద్ధూ జొన్నలగడ్డ చేసిన సినిమాలు ఒక ఎత్తు... ఈ సినిమా మరో ఎత్తు అన్నట్టు ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. ఇప్పటి వరకు ఆయన టచ్ చేయని జానర్, అటెంప్ట్ చేయని క్యారెక్టర్ చేస్తున్నారు. మైథాలజీ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో మహారాజు పాత్రలో సందడి చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ చేస్తున్న సినిమాలు ఏవి?
Siddu Jonnalagadda Upcoming Movies: 'టిల్లు స్క్వేర్' సక్సెస్ తర్వాత 'మిస్టర్ బచ్చన్' సినిమాలో అతిథి పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ కనిపించారు. హీరోగా ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న 'తెలుసు కదా' సినిమాతో పాటు 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' కూడా చేస్తున్నారు. వీటి తర్వాత 'టిల్లు క్యూబ్' చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు రవికాంత్ పేరేపు సినిమా యాడ్ అయ్యింది. 'తెలుసు కదా'లో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. 'జాక్'లో వైష్ణవీ చైతన్య నటిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)