Viswam Twitter Review - 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ: యాక్షన్ సీన్లలో బోయపాటిని గుర్తు చేసిన వైట్ల - మరి ట్రైన్ ఎపిసోడ్, గోపీచంద్ యాక్షన్?
Viswam Movie Review: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ ఫిలిం 'విశ్వం'. స్పెషల్ షోలు, అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి. మరి, సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందో చూద్దామా?
'వెంకీ', 'దూకుడు' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) విజయం అందుకుని చాలా రోజులైంది. హీరో గోపీచంద్ (Gopichand) చేసిన రీసెంట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ కాలేదు. నిర్మాత విశ్వప్రసాద్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అందులో హిట్స్ అయ్యేవి కొన్ని. భారీ బ్లాక్ బస్టర్ కోసం ఈ ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నం 'విశ్వం' (Viswam Movie). ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ట్విట్టర్ టాక్ ఏంటో తెలుసుకోండి.
బోయపాటిని గుర్తు చేసిన శ్రీను వైట్ల!
యాక్షన్ సన్నివేశాలను భారీగా తీయడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక స్టైల్ ఉంది. 'విశ్వం' సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చూశాక... బోయపాటిని శ్రీను వైట్ల గుర్తు చేశారని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. కొన్ని సన్నివేశాలలో బోయపాటి గుర్తొచ్చాడు అని పేర్కొన్నాడు.
Konni scenes boyapati gurthocchadu @SreenuVaitla
— yaswanth Dhfm (@urstrulynyr) October 10, 2024
#Viswam
గోపీచంద్ యాక్షనే కాదు... కామెడీ కూడా!
గోపీచంద్ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఆయన మరోసారి తన యాక్షన్ స్టైల్ చూపించారట. అన్నిటికంటే ముఖ్యంగా కామెడీ టైమింగ్ బాగా కుదిరిందట.
Also Read: 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?
రొటీన్ వైట్లను పక్కనపెడితే ట్రైన్ ఎపిసోడ్ కేక!
కామెడీ సన్నివేశాలను తీయడంలో శ్రీను వైట్లకు సపరేట్ స్టైల్ ఉంది. కానీ ఆయన ప్రతి సినిమాలో సేమ్ కాన్సెప్ట్ ఫాలో అవుతారని విమర్శ కూడా ఉంది. అయితే హీరోయిన్ ఇంటికి హీరో వెళ్లడం లేదంటే హీరో ఇంటికి హీరోయిన్ రావడం వంటివి జరుగుతాయని ఇంతకు ముందు సినిమాల్లో చూశాం. రొటీన్ శ్రీనువైట్ల ఫార్ములా ను పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుందని కామెడీ వర్కౌట్ అయిందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు.
Train episode started really well 😄 Vennela Kishore is on duty 👌 #Viswam
— Venkat Kondeti (@venkatpazzo) October 10, 2024
Train episode is good
— yaswanth Dhfm (@urstrulynyr) October 10, 2024
Vintage @SreenuVaitla is back with a bang #Viswam
ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగా వర్క్ అవుట్ అయిందట. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ గురించి శ్రీను వైట్ల సైతం ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. వెంకీ సినిమాలో ట్రైన్ సీక్వెన్స్ తరహాలో హిట్ అవుతుందని ఆడియన్స్ కూడా నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకాన్ని శ్రీనువైట్ల నిజం చేశారని ఎర్లీ రిపోర్ట్స్ చూస్తుంటే తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్ అదరగొట్టారట.
Also Read: జనక అయితే గనక ఓటీటీ... రైట్స్ అమ్మేసిన దిల్ రాజు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
క్లైమాక్స్ సరిగా తీయలేదా? అదొక్కటే మైనస్??
విశ్వం సినిమా ప్రీమియర్ రిపోర్ట్స్ బాగున్నాయి. హిట్ టాక్ వినబడుతోంది. అయితే క్లైమాక్స్ పోర్షన్ 30 మినిట్స్ సరిగా తీసి ఉంటే ఇంకా బాగుండేదని ట్విట్టర్ టాక్. మొత్తం మీద వింటేజ్ శ్రీను వైట్ల ఇస్ బ్యాక్ అని ఎన్ఆర్ఐ ఆడియన్స్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. మరి ఇండియాలో తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Just finished watching the show. Overall, it’s a typical entertainer, though the last 30 minutes felt a bit tiresome. 🙏🏽 Unfortunately, this isn’t a comeback for @SreenuVaitla; it feels more like a step backward. Rating 2.5/5 #Viswam
— Venkat Kondeti (@venkatpazzo) October 10, 2024
Above avg last 30 mins koncham sarrigga teyyalsindee
— yaswanth Dhfm (@urstrulynyr) October 10, 2024
#Viswam First Half : Good 👍👍
— CHITRAMBHALARE (@chitrambhalareI) October 10, 2024
The first half of #Viswam is a fun ride, with #Prudvi’s comic timing stealing the show!
The light-hearted moments keep the pace going, and the interval fight sets up an exciting second half.#Gopichand did well with outstanding performance 👌👌… pic.twitter.com/IAIKAYKbOm