Director Vikram Bhatt: ఆ స్టార్ హీరోయిన్స్‌తో ఎఫైర్ - వారిలో మాజీ విశ్వసుందరి కూడా, పేర్లు బయటపెట్టిన డైరెక్టర్
Director Vikram Bhatt : డైరెక్టర్ విక్రమ్ భట్ స్వయంగా తన ఎఫైర్స్‌పై నోరు విప్పాడు. ఇద్దరు స్టార్ హీరోయిన్ల బండారం బయటపెట్టి షాకిచ్చాడు. అందులో మాజీ విశ్వసుందరి కూడా ఉండటం మరో షాకింగ్ విషయం.
Director Vikram Bhatt About His Affairs: సినీ పరిశ్రమలో డేటింగ్, బ్రేకప్.. దర్శకులు, హీరోయిన్ల మధ్య రిలేషన్స్ కామన్. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఇలాంటి వ్యవహరాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అక్కడ డైవోర్స్, ఎఫైర్స్ కూడా సాధారణమే. కానీ అవన్ని వారు నేరుగా బయటకు చెప్పరు. తమ తీరుతో, ఇన్‌డైరెక్ట్ పోస్టులతో తమ రిలేషన్‌షిప్ స్టేటస్‌లు బయట పెడుతుంటారు. అయితే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ స్వయంగా తన ఎఫైర్స్‌పై నోరు విప్పాడు. అంతేకాదు ఇద్దరు స్టార్ హీరోయిన్ల బండారం బయటపెట్టి షాకిచ్చాడు. అందులో మాజీ విశ్వసుందరి కూడా ఉండటం మరో షాకింగ్ విషయం.
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గులాం, రాజ్ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను అందించిన విక్రమ్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తన గత రిలేషన్స్, ఎఫైర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో తాను మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్, నటి అమిషా పటేల్‌తో రిలేషన్‌లో ఉన్నానని చెప్పాడు. అప్పటికే తనకి పెళ్లయినా.. వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెప్పాడు. కాగా విక్రమ్ భట్ తన చిరకాల స్నేహితురాలు, ప్రియురాలు అదితిని 1989లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత 2000లో ఓ మూవీ షూటింగ్ సమయంలో అతడు సుస్మితా సేన్‌తో రిలేషన్ పెట్టుకున్నట్టు చెప్పాడు. అలాగే నటి అమిషా పటెల్‌తో కూడా రిలేషన్‌లో ఉన్నానని చెప్పాడు.
అయితే సుష్మిత, అమిషాలతో రిలేషన్ తన వైవాహిక జీవితంపై ప్రభావం చూపించాయా? అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు విక్రమ్ భట్ ఇలా స్పందించాడు. "ఆ సమయంలో ఉన్న బాధని నేను వివరించలేను. ఆ పెయిన్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సుష్మితాతో రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడే నా భార్య అతిథితో విడాకులు అయ్యాయి. ఆ టైంలో నా వైవాహిక జీవితం డిస్టర్భ్ అయ్యింది. మా విషయం తెలిసి తను (విక్రమ్ భార్య అదితి) నన్ను విడాకులు కోరింది. ఈ విషయంలో నేను ఎవరిని నిందించాలని అనుకోవడం లేదు. నా జీవితంలో ఏం జరిగినా అది నేను చేసిన పనులు, తప్పులే. కానీ వాటి గురించి నేను చింతించను. నేను చేసిన తప్పులు, ఎఫైర్స్ పట్ల నేను ఎప్పుడు ప్రశ్చాత్తాపడను. నేను ఏం చేసిన అది పూర్తిగా నా ఇష్టంతోనే చేశాను. నా జీవితం ఏంటని తిరిగి చూసుకుంటే అందులో చాలా ఉన్నాయి. అప్పుడే నా జీవితం పరిపూర్ణంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.
నటి ఉర్మిళా మటోండ్కర్‌తో కూడా..
సుష్మితా, అమిషాలతోనే కాదు నటి ఉర్మిళాతో కూడా రిలేషన్‌లో ఉన్నాను. ఆమెతో తన రిలేషన్‌ని సెమీ ఫిక్షనల్ అని పిలిచాడు. కాగా సుష్మితా సేన్ జీవితం ఆధారంగా రూపొందిన అంకాహీ సినిమా టైంలో ఊర్మిళాతో పాక్షికంగా రిలేషన్‌లో ఉన్నానని చెప్పాడు. వారితో మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది మహిళలు తన జీవితంలో ఉన్నారని ఒపెన్ అయ్యాడు. తన ఎఫైర్స్ విషయంలో తానేప్పుడు ప్రశ్చాత్తాపడలేదంటూ విక్రమ్ భట్ వ్యాఖ్యానించాడు.
Also Read: ‘హనుమాన్‘ మూవీ చూసిన ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి - ఆయన స్పందన ఇదే