అన్వేషించండి

Nayanthara: నయనతార హిట్ మూవీ సీక్వెల్‌కు డైరెక్టర్‌ని మార్చిన మేకర్స్‌ - కొత్త పోస్టర్స్‌తో సర్‌ప్రైజ్‌!

Mookuthi Amman 2: హిట్‌ మూవీ సీక్వెల్‌కు మేకర్స్‌ డైరెక్టర్‌ని మార్చేశారు. 2020లో నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ముకుత్తి అమ్మన్‌ 2 వస్తుంది.  

Nayanthara Team Up With Director Sundar c: సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార దేవతగా నటించి తమిళ చిత్రం 'ముకుత్తి అమ్మన్‌'. తెలుగులో 'అమ్మోరు తల్లి'. 2020లో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ లభించింది. నయనతార దేవత, నటుడు, డైరెక్టర్‌ బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిస్ని ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై వీక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది.  దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'ముకుత్తి అమ్మన్‌ 2' తీసుకువస్తున్నారు.

ఇటీవల దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. ఇందులోనూ నయనతార దేవతగా కనిపించబోతుంది. అయితే ప్రకటన సమయంలో డైరెక్టర్‌ ఎవరనేది వెల్లడించలేదు. నయతార అమ్మోరు తల్లిగా ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు, కానీ అందులో డైరెక్టర్‌ పేరును మాత్రం రివీల్‌ చేయలేదు. సీక్వెల్‌కి కూడా నటుడు బాలాజీనే డైరెక్ట్‌ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ, ఈ హిట్‌ మూవీ సీక్వెల్‌కు డైరెక్టర్‌ని మార్చి షాకిచ్చారు మేకర్స్‌. ఈ సినిమాకు డైరెక్టర్‌ను ఫిక్స్‌ చేసి ప్రకటన ఇచ్చారు.  'ముకుత్తి అమ్మన్‌ 2' చిత్రానికి ప్రముఖు దర్శకుడు-నటుడు సుందర్‌ సీ దర్శకత్వం వహించబోతున్నట్టు స్పష్టం చేశారు. 

Nayanthara: నయనతార హిట్ మూవీ సీక్వెల్‌కు డైరెక్టర్‌ని మార్చిన మేకర్స్‌ - కొత్త పోస్టర్స్‌తో సర్‌ప్రైజ్‌!

బాలాజీ స్థానంలో సుందర్ సీ

తాజాగా ఆయనను ఆన్‌బోర్డుకు స్వాగతం పలుకుతూ చిత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన వేల్స్‌ ఫిలిం ఇంటరనేషనల్‌ లిమిటెడ్‌ నిర్మాణ సంస్థ కొత్తపోస్టర్‌ రిలీజ్‌ చేసింది. "కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ల రాజు, దర్శకుడు సుందర్ సి డివైన్ ఫాంటసీ వరల్డ్ ఆఫ్ MA-2  స్వాగతం పలుకుతున్నాం" అంటూ ఆయన స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఇది చూసి అంతా షాక్‌ అయ్యారు. డివైన్‌ అండ్‌ ఫాంటసీ, హారర్‌ చిత్రాలకు సుందర్‌ సీ కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన దర్శత్వంలో వచ్చిన అరణ్మనై సీక్వెల్స్‌ అన్ని కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో 'ముకుత్తి అమ్మన్‌ 2' తెరకెక్కుతుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vels Film International (@velsfilmintl)

సీక్వెల్ కి భారీ బడ్జెట్

అయితే ఫస్ట్‌ పార్ట్‌కు నటుడు-యాక్టర్‌ బాలాజీ దర్శకత్వం వహించగా.. సీక్వెల్‌కు డైరెక్టర్‌ని మార్చడం ఇప్పుడు హాట్‌టాపిక్‌ మారింది. సీక్వెల్‌పై ప్రకటన రాగానే డైరెక్టర్‌ పేరును రీవిల్‌ చేయకపోవడం ఆసక్తిని సంతరించుకుంది. అయితే అంతా బాలాజీ ఈ సినిమాకు దర్శకుడు అనుకున్నారు. కానీ, అనుహ్యంగా 'ముకుత్తి అమ్మన్‌ 2' డైరెక్టర్‌ని మార్చి సుందరి సీ తెరపైకి తీసుకురావడం గమనార్హం. ఇదిలా ఉంటే 'ముకుత్తి అమ్మన్‌ 2' ఈసారి భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. డివైన్‌, ఫాంటసీ చిత్రంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఐవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, B4U మోషన్ పిక్చర్స్ బ్యానర్లో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవనీ సినిమాక్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా 'ముకుత్తి అమ్మన్‌ 2' చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి. 

Also Read: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget