అన్వేషించండి

Mokshagna Teja Debut Movie: 100 కోట్లతో నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ... బాలయ్య తనయుడి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Mokshagna First Remuneration: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి నట వారసుడు, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆ సినిమా బడ్జెట్ ఎంత? మొదటి సినిమా రెమ్యూనరేషన్ ఎంత?

Mokshagna Debut Movie Budget: కథానాయకుడిగా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ పరిచయానికి రంగం సిద్ధమైంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో సినిమా అనౌన్స్ చేశారు. ఆ మూవీ బడ్జెట్ ఎంత? ఆ సినిమాకు మోక్షజ్ఞ రెమ్యూనరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే...

వంద కోట్ల నిర్మాణ వ్యయంతో మోక్షజ్ఞ సినిమా
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (Prasanth Varma Cinematic Universe)లో మోక్షజ్ఞ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఆ యూనివర్స్‌లో వచ్చిన 'హనుమాన్' భారీ విజయం సాధించింది. పాన్ ఇండియా సక్సెస్ కొట్టింది. అది పక్కన పెడితే నందమూరి వారసుడి సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అవి అన్నీ దృష్టిలో పెట్టుకుని భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కించాలని ప్రశాంత్ వర్మ రెడీ అయ్యారట. నిర్మాత సుధాకర్ చెరుకూరి సైతం ఖర్చు విషయంలో రాజీ పడే అవసరం లేదని దర్శకుడికి చెప్పారట. ఆల్రెడీ వంద కోట్ల బడ్జెట్ కేటాయించారట.

మొదటి సినిమాకు రూ. 20 కోట్ల రెమ్యూనరేషన్!
వంద కోట్ల బడ్జెట్‌లో రూ. 20 కోట్లు మోక్షజ్ఞ రెమ్యూనరేషన్ అని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు తెలుగులో తొలి సినిమాకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో మరొకరు లేరని టాక్. ఈ విషయంలో నందమూరి వారసుడు రికార్డ్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. రెమ్యూనరేషన్ తర్వాత మెజారిటీ అమౌంట్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం స్పెండ్ చేయనున్నారని తెలిసింది.

మహాభారతం స్ఫూర్తితో.... అసలు కథ ఏమిటి?
భారతీయ పురాణ ఇతిహాస గ్రంథాల స్ఫూర్తితో సూపర్ హీరో సినిమాలు తీస్తానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. రామాయణంలోని హనుమంతుని స్ఫూర్తితో 'హను మాన్' తీశారు ఆయన. ఇప్పుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినిమాను మహాభారతం స్ఫూర్తితో తీస్తున్నారని సమాచారం. అభిమన్యుడి పాత్ర స్ఫూర్తితో హీరో క్యారెక్టర్ డిజైన్ చేశారట.

Also Readలైవ్‌లో షకీరాకు చేదు అనుభవం - షార్ట్ డ్రస్ వేసినప్పుడు ఇన్నర్స్‌ కనిపించేలా అసభ్యంగా వీడియోలు తీయడంతో...

నందమూరి మోక్షజ్ఞ తేజ, ప్రశాంత్ వర్మ సినిమా కథ లాక్ చేశారని, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా వరకు పూర్తి అయ్యాయని, అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

నిర్మాతగా మారుతున్న బాలకృష్ణ చిన్న కుమార్తె
తమ్ముడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని నందమూరి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఆమె సమర్పణలో లెజెండ్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్‌వి సినిమాస్ సంస్థలపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేవలం నందమూరి అభిమానులలో మాత్రమే కాదు... యావత్ తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మోక్షజ్ఞను సినిమా ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేశారు.

Also Read'ధూమ్ 4'లో సూర్య... బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రోలెక్స్‌కు ఛాన్స్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Bhogapuram Airport : వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
వాయువేగంతో రెడీ అవుతున్న అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టు - బోగాపురం మరో శంషాబాద్ కానుందా ?
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Dussehra 2024: అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
అక్టోబర్ 3 నుంచి బెజవాడ దుర్గ గుడిలో దసరా నవరాత్రులు ప్రారంభం
Embed widget