అన్వేషించండి

Suriya In Dhoom 4: 'ధూమ్ 4'లో సూర్య... బాలీవుడ్ సినిమాలో విలన్‌గా రోలెక్స్‌కు ఛాన్స్?

Suriya Bollywood Movies: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య శివకుమార్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నారా? యాక్షన్ సినిమాలో విలన్ రోల్ చేయమని ఆయన్ను అడిగారా? అంటే...

హారర్ సినిమాలకు సీక్వెల్స్ రావడం టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఆడియన్స్ చూశారు. 'బాహుబలి' వంటి భారీ యాక్షన్ అండ్ ఫాంటసీ ఫిలిమ్స్ రెండు పార్టులుగా విడుదల కావడం చూశారు. స్టైలిష్ యాక్షన్ సినిమాలకు సీక్వెల్స్ సౌత్ ఇండస్ట్రీలో తక్కువ. ఆ మాటకు వస్తే... ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో యాక్షన్ ఫిలిం ఫ్రాంచైజీ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'ధూమ్' సిరీస్. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో సూర్య చేరే అవకాశాలు ఉన్నాయని ముంబై టాక్.

ధూమ్ 4... సూర్యకు విలన్ ఛాన్స్?
'ధూమ్' సిరీస్ సినిమాలకు నార్త్ ఇండియా తో పాటు సౌత్ ఇండియా ప్రేక్షకులలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. 'ధూమ్' మొదటి సినిమాలో జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు. రెండో సినిమా వచ్చేసరికి బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులు అందరినీ మెప్పించారు. 'ధూమ్ 3' వచ్చేసరికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశారు. ఆయన విలనిజం చూసి ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు. 

ఇప్పుడు 'ధూమ్ 4' సినిమాలో విలన్ రోల్ చేయాల్సిందిగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను యష్ రాజ్ ఫిలిమ్స్ అప్రోచ్ అయ్యిందట. మరి, సూర్య ఏం చెప్పారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్!

Also Readలైవ్‌లో షకీరాకు చేదు అనుభవం - షార్ట్ డ్రస్ వేసినప్పుడు ఇన్నర్స్‌ కనిపించేలా అసభ్యంగా వీడియోలు తీయడంతో...


ప్రతినాయకుడిగా కనిపించడం సూర్యకు కొత్త ఏమీ కాదు. ఫస్ట్ టైం '24' సినిమాలో ఆయన విలన్ రోల్ చేశారు. అయితే అందులో హీరో కూడా ఆయనే. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజు రూపొందించిన 'విక్రమ్' సినిమాలో మరోసారి విలన్ వేషం వేశారు. 'విక్రమ్' సినిమాలో సూర్య పాత్ర నిడివి తక్కువే. అయినా సరే రోలెక్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఆ సినిమా వరకు ఆయన విలన్ కాదు. ఎందుకంటే... ఆ సినిమా తర్వాత రోలెక్స్ పాత్రను బేస్ చేసుకుని ఒక సినిమా తీయాలని లోకేష్ కనకరాజు ప్లాన్ చేస్తున్నారు.'కేజిఎఫ్', 'సలార్' తరహాలో రోలెక్స్ క్యారెక్టర్ ఆ సినిమాలో హీరో అవుతుంది. మరి 'ధూమ్ 4' సినిమాకు సూర్య ఓకే చెబుతారా? లేదా? అనేది చూడాలి.

Also Readజానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...


Suriya Upcoming Movies: సూర్య కథానాయకుడిగా శివ దర్శకత్వం వహించిన పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ ఫిలిం 'కంగువ' త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. తొలుత అక్టోబర్ 10న ఆ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసినా... సూపర్ స్టార్ రజనీకాంత్ 'వేట్టయాన్' రావడంతో వాయిదా వేశారు. ఇప్పుడు కొత్త విడతల తేదీ కోసం చూస్తున్నారు. 'కంగువ' కాకుండా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి సూర్య మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget