అన్వేషించండి

Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...

Jani Master Controversy: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు మరోసారి వివాదంలో వినిపించింది. ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల కేసు పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

తెలుగు, తమిళ చిత్రసీమలతో పాటు హిందీలోనూ పేరు ఉన్న నృత్య దర్శకుడు జానీ మాస్టర్ (Jani Master). ధనుష్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, భారతీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన 'తిరు చిత్రంబళం' సినిమాలో పాటకు గాను జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

జానీ మీద ఫిర్యాదు చేసిన 21 ఏళ్ల అమ్మాయి!
జానీ మాస్టర్ తనను కొంత కాలంగా వేధిస్తున్నారని, తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 21 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి ఆరోపణలు చేసింది. సదరు మహిళా నృత్య దర్శకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన అమ్మాయి ఆయనతో పాటు కొన్ని సినిమాలకు పని చేసినట్లు సమాచారం. సాంగ్స్ షూటింగ్ కోసం చెన్నై, ముంబై వంటి నగరాలకు వెళ్ళినప్పుడు... అవుట్‌ డోర్ షూటింగ్ చేసే సమయాల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సదరు మహిళ పేర్కొంది. అదే విధంగా , అలాగే హైదరాబాద్‌ సిటీలోని నార్సింగిలోని తన నివాసంలో కూడా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రాయదుర్గంలో జీరో ఎఫ్ఐఆర్... నార్సింగికి బదిలీ
జానీ మాస్టర్ మీద ఫిర్యాదు చేసిన మహిళ నార్సింగి నివాసి అయినప్పటికీ... ఆమె ఫిర్యాదు ఇచ్చినది మాత్రం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో! ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును నార్సింగికి బదిలీ చేశారు. 
జానీ మాస్టర్ మీద ఐపీసీ అత్యాచారం (సెక్షన్ 376), క్రిమినల్ బెదిరింపులు (సెక్షన్ 506), స్వచ్ఛందంగా గాయపరచడం (సెక్షన్ 323)లోని క్లాజ్ (2) అండ్ (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

జానీ మాస్టర్ మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారా?
ఇటీవల జానీ మాస్టర్ పేరు సినిమాలతో పాటు రాజకీయాల్లో వినబడుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఆయన చేరారు. ఏపీ ఎన్నికల సమయంలో జనసేనాని పోటీ చేసి విజయం సాధించిన పిఠాపురం సహా పలు ప్రాంతాలు పర్యటించి ప్రచారం చేశారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన మీద కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతోంది.

Also Read: హాలీవుడ్‌ రేంజ్‌లో 'దేవర'... ఒక్క ఫైట్‌కు 10 నైట్స్‌ - సైఫ్ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ

ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్నారు. కొన్ని నెలల క్రితం ఆయన మీద సతీష్ అనే మాస్టర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు ఆరోపణలు చేస్తూ వీడియో విడుదల చేశారు. అప్పుడు జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టి తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని చెప్పారు. కొందరు లేడీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు ఫోన్ చేసి జానీకి వ్యతిరేకంగా మాట్లాడమని సతీష్ చెబుతున్నట్లు ఆయన భార్య అలీషా చెప్పారు.

Also Read'దేవర' కథ లీక్ చేసిన ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ - స్టోరీ మెయిన్ పాయింట్ రివీల్ చేసేశారుగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget