అన్వేషించండి

Saif Ali Khan On Devara: హాలీవుడ్‌ రేంజ్‌లో 'దేవర'... ఒక్క ఫైట్‌కు 10 నైట్స్‌ - సైఫ్ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ

Devara Team Interview: 'దేవర'లో బైరా క్యారెక్టర్ చేశారు సైఫ్ అలీ ఖాన్. ఈ ఫిల్మ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేశానని అన్నారు. అంతే కాదు... 'దేవర'ను హాలీవుడ్ సినిమాతో కంపేర్ చేశారు.

Devara Team Interaction with Sandeep Reddy Vanga: 'దేవర'తో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన బైరా పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపిక వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే... మరొకరు ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ. 'ఓంకార'లో సైఫ్ నటన తనకు ఇష్టమని, తాను - శివ (కొరటాల) సంయుక్తంగా సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) అయితే బైరా పాత్రకు పర్ఫెక్ట్ అని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక... ఈ సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ చెప్పిన మాటలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.

'అపోక్లిప్టో' స్థాయిలో ఉంటుందీ 'దేవర'
'దేవర' (Devara Movie)ను హాలీవుడ్ సినిమా 'అపోక్లిప్టో'తో కంపేర్ చేశారు సైఫ్ అలీ ఖాన్. కొరటాల శివ క్రియేట్ చేసిన ప్రపంచం ఆ తరహాలో ఉంటుందని, ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవుతారని చెప్పుకొచ్చారు. దీనిని ఒక ట్రైబల్ పైరేట్స్ కథగా మనం చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. దాంతో ఆడియన్స్ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

ఒక్క ఫైట్ కోసం పది రోజులు కష్టపడ్డాం!
తనను శారీరకంగా, మానసికంగా ఎక్కువ కష్టపెట్టిన సినిమాల్లో 'దేవర' కూడా ఒకటి అని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. ఈ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం తాము 10 రోజులు షూటింగ్ చేశామని వివరించారు. కేవలం రాత్రి వేళల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్సీలు తీశామని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య పహిల్వాన్ తరహాలో జరిగే పోటీ అందులో భాగమని అర్థం అవుతోంది. ఆ యాక్షన్ సీక్వెన్సులో కొంత అవుట్ డోర్ ఉన్నప్పటికీ... అది కాకుండా కేవలం ఇండోర్ షూట్ కోసం పది రోజులు స్పెండ్ చేశామని ఆయన అన్నారు.

Also Read: 'దేవర' కథ లీక్ చేసిన ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ - స్టోరీ మెయిన్ పాయింట్ రివీల్ చేసేశారుగా


తెలుగు డైలాగ్స్ బాగా చెప్పడంతో రోజు రోజుకూ...
తెలుగులో తనకు 'దేవర' తొలి సినిమా కనుక డైలాగుల విషయంలో మొదట కొంత కంగారు పడ్డానని, అయితే దర్శకుడు కొరటాల శివ ఆ విషయంలో పెద్దగా టెన్షన్ తీసుకోవద్దని చెప్పడంతో తొలుత చిత్రీకరణలో పెద్దగా ఇబ్బంది కాలేదని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. ''నేను డైలాగులు చెప్పడంతో కొరటాల శివ తర్వాత పెంచారు. ఓ రోజు అసిస్టెంట్ వచ్చి డైలాగ్స్ ఇచ్చాడు. రెండు పేజీలు ఉన్నాయి'' అని సైఫ్ అలీ ఖాన్ సరదాగా చెప్పారు. 

'దేవర' సినిమా, అందులో తన క్యారెక్టర్ గురించి చెప్పిన సైఫ్ అలీ ఖాన్... ఆయన క్యారెక్టర్ మొదటి పార్టులో మరణిస్తుందా? లేదంటే రెండో పార్టులో ఉంటుందా? అని సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు. ఆ విషయం సెప్టెంబర్ 27న తెలుస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Also Readజాన్వీ కపూర్ కట్టిన చీర రేటు ఎంతో తెలుసా? ఇయర్ రింగ్స్ 13 లక్షలు ఏంటి బాసూ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget