Janhvi Kapoor: జాన్వీ కపూర్ కట్టిన చీర రేటు ఎంతో తెలుసా? ఇయర్ రింగ్స్ 13 లక్షలు ఏంటి బాసూ!
Janhvi Kapoor Saree Price: ముంబై జాన్వీ కపూర్ రోజుకు ఒక కొత్త డ్రస్‌లో సందడి చేస్తున్నారు. 'దేవర' ప్రచార కార్యక్రమాల్లో ఆవిడ ఓ పింక్ శారీ కట్టారు కదా! దాని రేటు ఎంతో తెలుసా?
Janhvi Kapoor in Devara promotions: దేవర... దేవర... దేవర... ఇది దేవర నామ వారం అని చెప్పాలి. ముంబైలో మంగళవారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దానికి ముందు హిందీ మీడియాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నయా అతిలోక సుందరి ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. దేవర ప్రచార కార్యక్రమాల్లో రోజుకు ఒక డ్రస్‌లో జాన్వీ కపూర్ సందడి చేస్తున్నారు.
పింక్ శారీ రేటు ఎంతో తెలుసా? అక్షరాలా లక్షకు పైనే!
'దేవర' పబ్లిసిటీ కార్యక్రమాల్లో జాన్వీ కపూర్ ఓ పింక్ శారీ కట్టారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... ఆ చీరలో ఆవిడ చాలా అందంగా ఉన్నారు. మరి, ఆ చీర రేటు ఎంతో తెలుసా? అక్షరాలా లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు (1,24,850/-). ఆ చీర, ఆ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ నచికేత్ బ్రావే డిజైన్ చేశారు.
Also Read: షాక్ ఇచ్చిన రష్మిక... నెల తర్వాత తీరిగ్గా యాక్సిడెంట్, రికవరీ గురించి రివీల్ చేసిందిగా
View this post on Instagram
జాన్వీ కపూర్ కట్టిన చీర కంటే ఆ చీర మీదకు వేసుకున్న ఇయర్ రింగ్స్ కాస్ట్ ఇంకా ఎక్కువ. ఆ ఇయర్ రింగ్స్ రేటు 13 లక్షలు. ఇది వింటే హార్ట్ ఎటాక్ వస్తుందని కొందరు సరదాగా కామెంట్ చేయడం విశేషం.
ఆ బ్లూ సారీ కాస్ట్ ఆల్మోస్ట్ రెండు లక్షలు
'దేవర' ప్రమోషన్స్ కోసం జాన్వీ కపూర్ మరొక శారీ కట్టారు. అంటే... చీర లాంటి ఆ చీర ఖరీదు 1,89,000 రూపాయలు. జాన్వీ కోసం తరుణ్ తాహిలియని ఆ బ్లౌజ్ డిజైన్ చేశారట. అన్నట్టు... అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు జాన్వీ సేమ్ డ్రస్ ధరించారు. ఇప్పుడు మరోసారి ఆ డ్రస్ రిపీట్ చేశారు. ఈ రెండు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Also Read: తెలుగులో కీర్తి సురేష్ 'రఘు తాత'... ఈ వారమే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ ఎందులో, ఎప్పుడంటే?
'దేవర' ట్రైలర్... జాన్వీ డైలాగ్ విన్నారా?
Janhvi Kapoor role in Devara: 'దేవర' ట్రైలర్ విషయానికి వస్తే... అందులో జాన్వీ కపూర్ పాత్రకు సైతం దర్శకుడు కొరటాల శివ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆమెతో ఓ డైలాగ్ కూడా చెప్పించారు. 'వాడికి వాళ్ల అయ్యా రూపం వచ్చింది తప్ప రక్తం రాలేదే' అంటూ జాన్వీ కపూర్ చెప్పారు. మరి, సినిమాలో ఎన్టీఆర్ - జాన్వీ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయో చూడాలి. ఆల్రెడీ విడుదలైన పాటల్లో వాళ్ళ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.
Also Read: 'జబర్దస్త్'కు కొత్త జడ్జి... పోతానన్నయ్యా పోతాను - వచ్చీ రావడమే పంచ్‌లతో చెలరేగిన శివాజీ