అన్వేషించండి

Shakira: లైవ్‌లో షకీరాకు చేదు అనుభవం - షార్ట్ డ్రస్ వేయడంతో అసభ్యంగా వీడియోలు తీస్తున్నారని...

క్వీన్ ఆఫ్ లాటిన్ మ్యూజిక్ షకీరాకు చేదు అనుభవం ఎదురైంది. లైఫ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో వేదిక ముందు ఉన్న క్రౌడ్ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె స్టేజి దిగి వెళ్లారు.

పాప్ సింగర్, 'క్వీన్ ఆఫ్ లాటిన్ మ్యూజిక్'గా పేరు పొందిన షకీరా (Pop Singer Shakira) తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా తెలుసు. పాప్ సాంగ్స్, ఆవిడ పాటలను రెగ్యులర్‌గా వినని వారు సైతం 'వాకా వాకా' సాంగ్ ఒక్కసారి అయినా తప్పకుండా విని ఉంటారు. ఫుట్ బాల్ వరల్డ్ కప్ కోసం ఆవిడ కంపోజ్ చేసిన ఆ సాంగ్ అంత పాపులర్ అయ్యింది. షకీరా పాటలు, ఆవిడ లైవ్ పెర్ఫార్మన్స్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉంటారు. అందుకే, షకీరా షోలకు క్రేజ్ నెలకొంది. అయితే... ఓ షోలో పెర్ఫార్మన్స్ ఇస్తున్న షకీరాకు చేదు అనుభవం ఎదురు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

షకీరాను అసభ్యంగా వీడియోలు తీయడంతో...
షకీరా వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్టేజి కింద ఏం జరిగింది? అనేది అందులో క్లారిటీగా తెలియడం లేదు. కానీ, ఆడియన్స్ ప్రవర్తన వల్ల షకీరా ఇబ్బంది పడినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. 

షార్ట్ మినీ డ్రస్‌లో పెర్ఫార్మన్స్ ఇవ్వడనికి షకీరా స్టేజి మీదకు వెళ్లారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో కింద నుంచి ఎవరో ఏదో చేశారని తెలుస్తుంది. దాంతో 'వద్దు' అని చేతితో షకీరా సైగలు చేయడం కనిపించింది. తర్వాత మళ్ళీ పెర్ఫార్మన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. రౌండ్ తిరిగి వచ్చేసరికి స్టేజి కింద ఉన్న వ్యక్తి తాను చేసే పని ఆపలేదు. దాంతో మరోసారి వద్దని చెప్పిన షకీరా స్టేజి దిగి వెళ్లిపోయారు. 

షకీరా షార్ట్ డ్రస్ వేయడంతో ఆవిడ ఇన్నర్స్ కనిపించేలా అసభ్యంగా వీడియోలు తీయడం మొదలు పెట్టారని, అందువల్ల షకీరా పెర్ఫార్మన్స్ మధ్యలో ఆపేసి స్టేజి దిగారని తెలుస్తోంది. అక్కడికీ డ్రస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆవిడ ట్రై చేశారు. కానీ, అసభ్య ప్రవర్తనకు అడ్డుకట్ట పడలేదు. దాంతో కిందకు దిగారు.

Also Read: రోహిణి కమిటీపై చిన్మయి కామెంట్స్... లైంగిక వేధింపులకు పాల్పడిన వైరముత్తులను ఏం చేయలేరంటూ


సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో చూస్తే... షకీరా పెర్ఫార్మన్స్ మియామీలో జరిగినట్టు అర్థం అవుతోంది. ఆమెతో పాటు మరొక లాటిన్ సింగర్ అనిట్ఠా కూడా పెర్ఫార్మన్స్ దగ్గర ఉన్నారు. షకీరా స్టేజి దిగిన తర్వాత 'అంతా ఓకే నా' అని ఆమెను అనిట్ఠా అడగటం కనిపించింది. 

షకీరా తప్పేం లేదు... ఆవిడ చేసింది కరెక్టే!
షకీరాకు మద్దతుగా సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు చేస్తున్నారు. ఆవిడ చేసింది తప్పేం కాదని, క్రౌడ్ అసభ్యంగా ప్రవర్తించినప్పుడు స్టేజి దిగి వెళ్లే రైట్ ఆమెకు ఉందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ఆ విధంగా కొన్ని పోస్టులు ఉంటే... కొందరు స్టేజి దగ్గర ఉన్న వ్యక్తులకు మద్దతుగా పోస్టులు చేశారు. షకీరా షార్ట్ డ్రస్ వేసుకోవడం వల్ల వాళ్ళు వీడియోలు తీయలేదని, స్పేస్ సూట్ వేసినా సరే వీడియోలు తీస్తారని, ఆమె పెర్ఫార్మన్స్ రికార్డు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద నెట్టింట షకీరా మరోసారి వైరల్ అయ్యింది.

Also Readజానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget