అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source:  Poll of Polls)

భజన, పొగడ్తలకి అలవాటుపడ్డారు, ఆ జాతిని దూరం పెట్టాలి - చిరంజీవికి ఆర్జీవీ సలహా!

ఈమధ్య మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశిస్తూ పలు ట్వీట్స్ చేశారు.

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ మధ్యకాలంలో ఆయన సినిమాల సంఖ్య తక్కువయింది, వివాదాల సంఖ్య ఎక్కువైంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఆర్జీవి చేసే ట్వీట్స్ మెగా ఫ్యాన్స్‌కు ఆగ్రహం కలిగిస్తున్నాయి. మరోసారి ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళాశంకర్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈరోజు విడుదలైన 'భోళాశంకర్' ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా ఏమాత్రం బాలేదని కొందరు అంటుంటే, సూపర్ హిట్ అని మరికొందరు అంటున్నారు. రొటీన్ కమర్షియల్ మూవీ అని కొందరు చెబుతున్నారు. అయితే తాజాగా ఇదే విషయంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తన ట్విట్టర్లో పలు ట్వీట్స్ చేశారు. "జబర్, హైపర్ లాంటి ఆస్థాన విదూషకులు భజన పొగడ్తలకి అలవాటు పడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తుంది" అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. "పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు. రియాలిటీ తెలిసే లోపల రాజుగారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టడమే మంచిది" అని అన్నారు. దీంతో వర్మ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే తన ట్వీట్లో వర్మ 'జబ్బర్, హైపర్' లాంటి పదాలు వాడడంతో కచ్చితంగా ఆయన డైరెక్టర్ మెహర్ రమేష్, హైపర్ ఆది లను ఉద్దేశిస్తూ పరోక్షంగా ఈ ట్వీట్స్ చేశాడంటూ కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి వర్మ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారో ఆయనకే తెలియాలి. కానీ భజన బ్యాచ్ ని పక్కన పెడితే మెగాస్టార్ కి మేలు జరుగుతుంది అనే విషయాన్ని రామ్ గోపాల్ వర్మ  తన ట్వీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఆర్జీవి చేసిన ఈ వ్యాఖ్యలపై చిరంజీవి ఏమైనా స్పందిస్తారా? లేదా ఆయన అభిమానులు రియాక్ట్ అవుతారా? అనేది చూడాలి.

'భోళాశంకర్' విషయానికొస్తే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు(ఆగస్టు11) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళం లో అజిత్ నటించిన 'వేదాలం' అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్గా నటించగా.. కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో కనిపించారు. రఘు బాబు, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, హైపర్ ఆది, వైవాహర్ష, గెటప్ శీను, మురళి శర్మ, కమెడియన్ సత్య, వేణు, శ్రీముఖి, లోబో మరియు ఇతర తారాగణం. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే ఉమెన్ ట్రాఫికింగ్ విషయాన్ని సిస్టర్ సెంటిమెంట్ తో లింక్ చేస్తూ తెరమీద సినిమాని ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతమందించారు.

Also Read : ఆ సమయంలో నేను 5 నెలల గర్భవతిని - బిడ్డను కూడా పోగొట్టుకున్నాను: రాణి ముఖర్జీ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet: టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
టూరిజం పాలసీకి ఆమోదం - కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Paritala Sunitha: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరులు జాకీని వెళ్లగొట్టారు, తక్షణం చర్యలు చేపట్టాలి: పరిటాల సునీత
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Allu Arjun: భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
భార్యతో బన్నీ సీక్రెట్ వాట్సాప్ చాట్ గ్రూప్- ఎందుకు, ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా?
Karthika Vanabhojanam 2024: కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
కార్తీక సమారాధన అంటే క్యాటరింగ్ భోజనాలు కాదు..అసలైన వనభోజనాలంటే ఇవి!
Vizag Crime News: లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
లా స్టూడెంట్‌పై గ్యాంగ్‌ రేప్‌ కేసులో లవర్ సహా నలుగురు నిందితుల అరెస్ట్‌
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Viral News: దేవుడిలా వచ్చి సీపీఆర్ చేసి మహిళ ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్స్
Telangana News: తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు - ప్రజలకు ఆరోగ్య శాఖ బిగ్ అలర్ట్
Embed widget