Deepika Padukone: ‘కల్కి 2898 AD’ కోసం దీపికా పదుకొనె అంత రెమ్యునరేషన్ తీసుకుందా? హీరోలను మించిపోయిందిగా!
Deepika Padukone Remuneration: ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతోంది దీపికా పదుకొనె. అందుకే తన మొదటి తెలుగు సినిమా అయిన ‘కల్కి 2898 AD’ కోసం ఓ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
![Deepika Padukone: ‘కల్కి 2898 AD’ కోసం దీపికా పదుకొనె అంత రెమ్యునరేషన్ తీసుకుందా? హీరోలను మించిపోయిందిగా! Deepika Padukone Remuneration for Kalki 2898 AD shocks audience Deepika Padukone: ‘కల్కి 2898 AD’ కోసం దీపికా పదుకొనె అంత రెమ్యునరేషన్ తీసుకుందా? హీరోలను మించిపోయిందిగా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/3230170e04b7a8e82c06e53f5f9d29921718771202371802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Deepika Padukone Remuneration For Kalki 2898 AD: గత కొన్నేళ్లలో చాలామంది నటీనటులకు పాన్ ఇండియా పాపులారిటీ లభించింది. ఒకప్పుడు హీరోలు మాత్రమే ఓ రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా వారికి సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. చాలావరకు నిర్మాతలు.. వారి డిమాండ్స్‌ను కాదనుకుండా పారితోషికాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ కోసం దీపికా పదుకొనె తీసుకున్న రెమ్యునరేషన్ గురించి అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీ టౌన్‌లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న దీపికాకు తెలుగులో ఇది మొదటి సినిమా.
అందుకే డిమాండ్..
ప్రస్తుతం బాలీవుడ్‌లో నెంబర్ 1 నటీమణి ఎవరు అనే విషయంపై గట్టి పోటీనే నడుస్తోంది. ఆ రేసులో దీపికా పదుకొనె కూడా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడంతో పాటు ఆ చిత్రాలు దాదాపుగా హిట్ అవ్వడంతో తన పారితోషికాన్ని కూడా బాగా పెంచేసిందట. 2024లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా మారిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ‘కల్కి 2898 AD’తో తెలుగులో డెబ్యూకు సిద్ధమయ్యింది దీపికా. ఇది తన మొదటి సినిమానే అయినా.. ఇప్పటికే బాలీవుడ్‌లో తనకు విపరీతంగా పాపులారిటీ ఉండడం, పైగా ఇది ప్యాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కిన చిత్రం కావడంతో తనకు ఓ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందినట్టు సమాచారం.
రెండూ హిట్లే..
మామూలుగా దీపికా పదుకొనె ఒక్క సినిమా కోసం రూ.15 నుండి 30 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తుంది. ఇక ‘కల్కి 2898 AD’ కోసం తను రూ.20 కోట్లకు పైగానే ఛార్జ్ చేసిందని సమాచారం. హీరోయిన్‌గా దీపికా చివరి సినిమా ‘పఠాన్’. అది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకొని రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌ను సాధించింది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘జవాన్’లో ఒక గెస్ట్ రోల్‌లో కనిపించింది. స్క్రీన్‌పై దీపికా కనిపించింది కాసేపే అయినా అందులో హీరోయిన్ నయనతారకు ఎంత గుర్తింపు లభించిందో దీపికాకు కూడా అంతే ప్రశంసలు అందాయి. దీంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడడంతో దీపికా.. ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రేసులో ఆ ముగ్గురు..
బాలీవుడ్‌లో దీపికా పదుకొనె తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లిస్ట్‌లో కంగనా రనౌత్ ఉంది. తను ఒక్క సినిమాకు రూ.15 నుండి 27 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుందట. కంగనా రనౌత్ పర్సనల్ లైఫ్‌లో కాంట్రవర్సీలు ఉన్నా.. తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోయినా కూడా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదట ఈ భామ. ఇక బాలీవుడ్‌ను వదిలేసి పూర్తిగా హాలీవుడ్‌లో సెటిల్ అయిపోయిన ప్రియాంక చోప్రా సైతం ఒక్క మూవీ చేయడానికి రూ.15 నుండి 25 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ‘కల్కి 2898 AD’తో ఈ లిస్ట్‌లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది దీపికా పదుకొనె.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)