అన్వేషించండి

 Chiyaan Vikram: విక్రమ్‌ 'తంగలాన్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది - రెండు భారీ తెలుగు సినిమాలకు పోటీగా థియేటర్లోకి..

Vikram Thangalaan movie Release Date: చియాన్‌ విక్రమ్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ తంగలాన్‌ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను తాజాగా ప్రకటించారు. 

Vikram Thangalaan movie Release Date Announced: తమిళ స్టార్‌ హీరో 'చియాన్'‌ విక్రమ్‌ (Chiyaan Vikram) మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం 'తంగలాన్‌'. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ మూవీ 'కబాలి' ఫేం పా రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో విక్రమ్‌ లుక్‌, ప్రచార పోస్టర్స్‌ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ కోసం ఆడియన్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అనంతరం మూవీ విపరీతమైన బజ్‌ నెలకొంది.

Thangalaan movie Release Movie Release Update:ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించి ఆడియన్స్‌నిక సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మూవీ టీం. ఆగ‌స్టు 15న (August 15th) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు మూవీ టీం తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది.  దీంతో ఫ్యాన్స్‌ అంతా పుల్‌ ఖుష్‌ అవుతున్నారు. అయితే తెలుగులో తంగలాన్‌ రెండు భారీ చిత్రాలతో పోటీ దిగనుంది. అదే అగస్ట్‌ 15న రామ్ పోతినేని-పూరీ జగన్నాథ్‌ల 'డబుల్‌ ఇస్మార్ట్‌', మాస్‌ మహారాజ రవితేజ Mr. బచ్చన్‌ చిత్రాలు విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మూవీ మేకర్స్‌ ప్రకటించారు.  పిరియాడికల్‌ డ్రామా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (Green Studio) పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో విక్రమ్‌ ట్రైబల్‌ తెగకు చెందిన వ్యక్తిగా అలరించబోతున్నాడు. ఇప్పటికే విక్రమ్‌ ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ ఆయన విశ్వరూపం చూసిన ఫ్యాన్స్‌ అంతా థియేటర్లో మూవీ చూసేందుకు ఫుల్‌ క్యూరియాసిటీగా ఉన్నారు. ఈ క్రమంలో మూవీ టీం తంగళాన్‌ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తంగలాన్‌ చిత్రాన్ని  తెరకెక్కించారు. 19వ శతాబ్దంలో జరిగిన ఘటనలను ఈ సినిమాలో మేకర్స్‌ చూపించనున్నారు. కేజీఎఫ్ గోల్డ్‌ మైన్స్‌ని బ్రిటీష్ వాళ్ల నుంచి  తంగలాన్‌ అనే ఒక తెగ ఎలా కాపాడుకున్నదో ఈ చిత్రం ద్వారా పా. రంజిత్‌ చూపించబోతున్నారు.

మెసేజ్‌ ఒరియంటెడ్‌, కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ క‌థ‌ల‌ను హ్యాండిల్ చేయ‌డంలో దిట్ట అయిన పా రంజిత్, తంగ‌లాన్ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతున్నాడా? అనేది ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మాళ‌విక మోహ‌న‌న్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పార్వ‌తి తిరువొతు, ప‌శుప‌తి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమాకు యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ జీ.వీ.ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో హీరోతో పాటు హీరోయిన్‌ కూడా యాక్షన్స్‌ సీక్వెన్స్‌లో నటించింది. ఇందుకోసం మాళవిక మోహనన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌తో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. ఇక తంగలాన్‌ కోసం విక్రమ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. ఈ సినిమాకు ఆయన భారీగా బరువు తగ్గారు. ఏకంగా 35 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. 

Also Read: గడువు ముగిసిన విచారణకు రాని రాజ్‌ తరుణ్‌ - ఆలస్యంగా స్పందిస్తూ పోలీసులకు లేఖ, ఏమన్నాడంటే..

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget