అన్వేషించండి

Raj Tarun: గడువు ముగిసిన విచారణకు రాని రాజ్‌ తరుణ్‌ - ఆలస్యంగా స్పందిస్తూ పోలీసులకు లేఖ, ఏమన్నాడంటే..

Raj Tarun Write Letter to Police: గుడువు ముగిసిన విచారణ హాజరుకాలేదు రాజ్‌ తరుణ్‌. దీనిపై ఆలస్యంగా స్పందిస్తూ పోలీసులకు లేఖ రాశాడు. ఈ లేటర్‌ రాజ్‌ తరుణ్‌ లాయర్ పోలీసులకు అందించినట్టు సమాచారం. 

Raj Tarun Letter to Police: ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఇటీవల టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు లావణ్య పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పదకొండేళ్లు తనతో రిలేషన్‌లో ఉండి.. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఈ నెల 5న నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాదు హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, రాజ్‌ తరుణ్‌కు మధ్య ఎఫైర్‌ ఉందని కూడా ఆరోపించింది. ఇటీవల కీలక ఆధారాలతో పాటు ఫోటోలు సమర్పించింది లావణ్య. దీంతో రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేసిన నార్సింగ్‌ పోలీసులు.. విచారణకు హాజరవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు.

ఈనెల 18 లోపు విచారణకు హాజరు కావాల్సిందేనని ఇందులో పేర్కొన్నారు. అయితే గడువు ముగిసిన రాజ్‌ తరుణ్‌ ఇంతవరకు పోలీసు నోటీసులపై స్పందించలేదు. ఇక తాజాగా విచారణకు హాజరు కాకపోవడంపై రాజ్‌ తరుణ్‌ పోలీసులకు లేక రాసినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణకు రాలేనంటూ రాజ్‌ తరుణ్‌ పోలీసులకు రాసిన లేఖను తన లాయర్‌ ద్వారా అందజేశారు. నేడు(జూలై 19) అతడి న్యాయవాది ఆ లేఖను పోలీసులకు అందించనిట్టు సమాచారం. ప్రస్తుతం తాను మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నానని, అందువల్లే విచారణకు రాలేకపోయానంటూ రాజ్‌ తరుణ్‌ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కొద్దిరోజుల్లో తను నటించిన సినిమా విడుదల కానుందని, ఆ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఇప్పట్లో విచారణకు రాలేనని లేఖలో తెలిపాడు.

అందుచేత విచారణను వాయిదా వేయాలని, మరో రోజు విచారణకు తప్పకుండా వస్తానని అతడు తన లేఖలో వివరణ ఇచ్చాడట. దీంతో పోలీసు చట్టబద్ధంగా రాజ్‌ తరుణ్‌ లేఖను ఆమోదించారట. ఈ మేరకు మరోసారి రాజ్ తరుణ్‌కు నోటీసులు పంపనున్నారట. రెండోసారి నోటీసులు జారీ చేశాక  రాజ్ తరుణ్ స్పందించకపోతే తగు చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా అతడి ప్రియురాలు లావణ్య ఫిర్యాదుతో నార్సింగ్‌ పోలీసులు విచారణకు హాజరు కావాలని రాజ్‌ తరుణ్‌కు BNSS 45 కింద నార్సింగ్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూలై 5న కోకాపేటకు చెందని లావణ్య రాజ్‌ తరుణ్‌ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ కారణంగానే తనని దూరం పెడుతున్నాడని ఆరోపించింది. తాను రాజ్‌ తరుణ్‌ కొన్నేళ్లు కలిసే ఉన్నామని, రహస్యంగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ మొదట ఫిర్యాదు చేసింది.

అంతేకాదు రాజ్‌ తరుణ్‌ తనకు అబార్షన్‌ కూడా చేయించాడని ఆరోపించింది. ఇక రాజ్‌ తరుణ్‌ వెంటనే స్పందించి లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆమెకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో ఎఫైర్‌ ఉందని, వారిద్దరు సహాజీవనం కూడా చేస్తున్నారని సంచలన కామెంట్స్‌ చేశాడు. రాజ్‌ తరుణ్‌ కామెంట్స్‌తో పోలీసులు లావణ్య తిరిగి నోటీసులు పంపారు. తన ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలు సమర్పించాలని పోలీసులు ఆమెను ఆదేశించారు. దీంతో లావణ్య  ఈ నెల 15-16న నార్సింగ్‌ పోలీసులను కలిసి 170 ఫోటోలు, కీకల ఆధారాలు అందించింది. అంతేకాదు కొత్తగ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేసింది. లావణ్య ఆధారాలు ఇవ్వడంతో నార్సింగ్‌ పోలీసుల రాజ్‌ తరుణ, మాల్వీ మల్హోత్రా ఆమె సోదరుడిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ జూలై 16న రాజ్‌ తరుణ్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. 

Also Read: రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' అంటున్న ప్రకాశ్‌ రాజ్‌ - వివాదాల మధ్యలో విడుదలకు రెడీ..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ
విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ
Pawan Mahesh Donation: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం
వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం
YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
Upcoming Cars in September 2024: సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న మోస్ట్ అవైటెడ్ కార్లు - ఎంజీ నుంచి మెర్సిడెస్ వరకు!
సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న మోస్ట్ అవైటెడ్ కార్లు - ఎంజీ నుంచి మెర్సిడెస్ వరకు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manthena Ashram Drowned in Flood water| విజయవాడ వరదల్లో నీట మునిగిన మంతెన  ఆశ్రమం | ABP DesamJr NTR and Rishabh Shetty Visit Keshavanatheshwara Temple | కర్ణాటకలో ఎన్టీఆర్ పూజలు.. సూపర్ వీడియోఖమ్మంలో బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించిన డ్రైవర్FTL దాటిన హుస్సేన్ సాగర్ .. దిగువ ప్రాంతాల్లో హై అలెర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ
విజయవాడలో వరద బాధితుల్ని అందుకే కలవలేదు - పవన్ కల్యాణ్ క్లారిటీ
Pawan Mahesh Donation: వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం
వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.1 కోటి విరాళం - మహేష్ బాబు సైతం భారీగానే సాయం
YS Jagan Donation: వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించిన మాజీ సీఎం జగన్, నేరుగా ఇస్తారా?
Upcoming Cars in September 2024: సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న మోస్ట్ అవైటెడ్ కార్లు - ఎంజీ నుంచి మెర్సిడెస్ వరకు!
సెప్టెంబర్‌లో మార్కెట్లోకి రానున్న మోస్ట్ అవైటెడ్ కార్లు - ఎంజీ నుంచి మెర్సిడెస్ వరకు!
KTR News: సాయం చేతగాక బీఆర్ఎస్ లీడర్లపై దాడి చేస్తారా - కేటీఆర్ ఆగ్రహం
సాయం చేతగాక బీఆర్ఎస్ లీడర్లపై దాడి చేస్తారా - కేటీఆర్ ఆగ్రహం
Airtel net work: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్
తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్
Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌కి కలిసోచ్చిన లావ్‌ ట్రాక్స్‌ - ఈ ఏడు సీజన్స్‌లో హాట్‌టాపికైన ప్రేమ జంటలు ఇవే, ఈసారి...
బిగ్‌బాస్‌కి కలిసోచ్చిన లావ్‌ ట్రాక్స్‌ - ఈ ఏడు సీజన్స్‌లో హాట్‌టాపికైన ప్రేమ జంటలు ఇవే, ఈసారి...
Mahindra Thar: గుడ్‌న్యూస్ - థార్‌పై భారీ తగ్గింపు - ఎంత తగ్గిందో తెలుసా?
గుడ్‌న్యూస్ - థార్‌పై భారీ తగ్గింపు - ఎంత తగ్గిందో తెలుసా?
Embed widget