Chinmayi Sripada: భర్త రాహుల్‌పై చిన్మయి పోస్ట్ - కూతురికి తండ్రి హగ్ ఇస్తే తప్పేంటి? గాయనిపై నెటిజన్ల సెటైర్లు!
Trolls on Chinmayi Sripada: తన భర్త, కూతురిపై చేసిన పోస్ట్‌పై నెటిజన్లు సింగర్ చిన్మయి శ్రీపాదను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తండ్రికూతుళ్ల బంధాన్ని కూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు.
Chinmayi Sripada React on Trolls: స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద ప్రస్తుతం సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అవుతోంది. తండ్రికూతుళ్ల పవిత్రమైన బంధాన్ని కూడా తప్పుగా చూస్తున్నావంటూ ఆమెపై మండిపడుతున్నారు. అంతేకాదు ఆమెపై సటైర్లు వేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెరవెనుక తన మధురమైన గాత్రంతో సింగీత ప్రియులను అలరిస్తుంది. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ తన వాయిస్‌తో ఆకట్టుకుంటుంది. తెరవెనుక ఉంటూ ఆడియన్స్‌ని, మ్యూజిక్ లవర్స్‌ని అలరించే చిన్మయి తెరమీదకు వచ్చిందంటే అది వివాదస్పదమే అవుతుంది.
సమాజంలో ఆడవాళ్లపై జరిగే ఆకృత్యాలపై తన గళం విప్పుతుంది. మీ టూ ఉద్యమంలో సమయంలో గళం విప్పిన వారిలో చిన్మయి ముందు వరుసలో ఉంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ జరిగే అంశాలను సైతం ధైర్యంగా బయటపెడుతుంది. మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ అగ్ర రైటర్ వైరముత్తు బండారాన్ని బయటపెట్టింది. ఇక మహిళలు, చిన్న పిల్లలపై ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె తన రెండేళ్ల కూతురు, తన భర్త రాహుల్ గురించి ఓ పోస్ట్ చేసింది.
View this post on Instagram
"కొన్ని రోజుల క్రితం రెండేళ్ల నా కూతురుని నా భర్త రాహుల్ హగ్ చేసుకోబోతుంటే తను నో చెప్పింది. దీంతో వెంటనే ‘నేను నిన్ను హగ్ చేసుకోమని ఫోర్స్ చేయడం లేదమ్మా... నాన్నకి నువ్వు అంటే చాలా ఇష్టం గుర్తు పెట్టుకో చాలు’ అంటూ తన కుమార్తెకు చెప్పాడు. రాహుల్ మళ్లీ తనని హగ్ చేసుకోవడానికి వెళ్లలేదు. ఇది నేను కూడా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాను. ఆరేడేళ్ల అమ్మాయి దగ్గరైనా సరే తన అనుమతి లేకుండా కనీసం బుగ్గ కూడాగిల్లను. అలాగే వాళ్ల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయను" అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తండ్రికూతుళ్ల బంధాన్నికూడా తప్పుగా చూడటం కరెక్ట్ కాదంటూ ఆమెకు ఛీవాట్లు పెడుతున్నారు. ఇక ఓ నెటిజన్ అయితే "నా కూతురు స్కూల్ వెళ్లమంటే నో చెప్పింది. దీంతో తన మాటను గౌరవించి ఇంట్లోనే ఉంచాను. ఇప్పుడు తనకి పదేళ్లు. చదువు లేకుండా ఇంట్లోనే ఉంటుంది" అంటూ వ్యంగ్యంగా చిన్మయి ట్వీట్‌కి రీట్వీట్ చేశాడు.
ఇక తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్‌పై చిన్మయి కూడా స్పందించింది. నా కూతురు, భర్త గురించి చేసిన పోస్ట్‌పై కొందరు నన్ను ట్రోల్ చేస్తున్నారు. సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కూతురు స్కూల్‌కి వెళ్లను అంటే నేను ఆలోచిస్తాను. తన ప్రాబ్లమ్ ఎంటనేది తెలుసుకుని స్వాల్వ్ చేస్తాను అంటూ కౌంటర్ ఇచ్చింది. తన భర్త రాహుల్ అల్ఫా మెన్.. మీలా షిట్ కాదు. తండ్రికూతుళ్ల బంధం చాలా పవిత్రమైనది. కానీ, నేను చెప్పాలకున్నది వేరు. పిల్లలు ఎవరైనా మనం టచ్ చేస్తుంటే వద్దు అన్నారంటే అది అర్థం చేసుకోవాలని. వాళ్లని బలవంతం పట్టుకోవడం, బుగ్గ గిల్లడం చేయొద్దు అన్నది నా ఉద్దేశం. నా కూతురు అలా చెప్పగానే నా భర్త రాహుల్ ఆగిపోయాడు. అప్పుడు తనపై నాకు మరింత గౌరవం పెరిగింది" అంటూ వివరణ ఇచ్చింది.
Also Read: చిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు - మెగా మల్టీస్టారర్ వర్కవుట్ కావాలని ఫ్యాన్స్ వెయిటింగ్!