By: ABP Desam | Updated at : 01 May 2023 08:45 PM (IST)
Images Credit: Dhee Chaithanya Master/Instagram
బుల్లితెర డాన్స్ షో ‘ఢీ’తో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న చైతన్య మాస్టర్ ఆదివారం రాత్రి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు చైతన్య మాస్టర్. తనకు అప్పులు ఎక్కువయ్యాయని, అవి తీర్చే సత్తా ఉన్నా మానసిక ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నాని ఆ వీడియోలో చెప్పాడు. ఇక ‘ఢీ’ పేరుతో పాటు పాపులారిటీ ఇస్తుంది. కానీ సంపాదన అనుకున్నంత ఇవ్వదంటూ తన ఆవేదనను వ్యక్త పరిచాడు. అప్పుల పోరు తట్టుకోలేకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు స్వయంగా వెల్లడించాడు.
ఇక చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తోటి కొరియోగ్రాఫర్లు తమ ఆవేదనను వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలోనే చైతన్య మాస్టర్ తో అనుబంధాన్ని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతన్నారు. తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ స్పందిస్తూ.. ‘‘నీ ప్రాబ్లమ్ కి ఇది సొల్యూషన్ కాదు చైతన్య. నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. ఇక రష్మీ తో పాటూ ప్రస్తుతం ‘ఢీ 15’ సీజన్ కి జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ శ్రద్ధ దాస్ సైతం చైతన్య మాస్టర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇన్‌స్టా స్టోరీ ద్వారా తన బాధను వ్యక్తం చేసింది.
‘‘పుట్టుక, చావు ఎప్పుడు ఎందుకు జరుగుతాయో ఎవ్వరికి తెలియదు. కానీ ఈ రెండిటికి మధ్య మనం ఎలా బతికామన్నదే మనల్ని గొప్ప వారిలా చేస్తుంది. నిజంగా చెప్తున్నా.. చైతన్య మాస్టర్ ఎంతో మంచి వ్యక్తి. అంతకంటే గొప్ప మనసున్న మనిషి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. మీరు నవ్వూతూ అందరిని నవ్వించేవ్వాళ్లు. కానీ ఈ రోజు నన్ను ఎంతో ఏడిపించారు. మీ చిరునవ్వు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే అతనితో కలిసి డ్యాన్స్ చేసిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది శ్రద్ధ దాస్.
మరోవైపు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా స్పందిస్తూ.. ‘‘నీలాంటి టాలెంట్ ఉన్న డ్యాన్స్ మాస్టర్ ను కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ వార్త వినగానే నా గుండె పగిలింది. చాలా డిస్టర్బ్ అయ్యాను. నీ చిరునవ్వుని ఎన్నటికీ మరిచిపోలేను. నిన్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం’’ అంటూ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఇదిలా ఉంటె సూసైడ్ కి ముందు చైతన్య మాస్టర్ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో లో చైతన్య మాస్టర్ పేర్కొంటూ.. అమ్మ నాన్న చెల్లి ఐ లవ్ యు సో మచ్ నన్ను ఏ కష్టం రానివ్వకుండా చాలా బాగా చూసుకున్నారు. మన ఫ్యామిలీకి చాలా చేద్దామని అనుకున్నా. కానీ కుదరలేదు. అప్పులు ఎక్కువయ్యాయి. తీర్చే ధైర్యం ఉన్నా తీర్చలేకపోతున్నా. అస్సలు తట్టుకోలేకపోతున్నా. నా ఫ్రెండ్స్ కి తోటి డ్యాన్సర్స్ కి సారీ. ఢీ పేరు ఇస్తుంది. కానీ సంపాదన తక్కువ ఇస్తుంది. అదే జబర్దస్త్ లో సంపాదన ఎక్కువ వస్తుంది అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఇక ఈ వీడియో చూసిన అందరూ కన్నీటిపర్యంతం అవుతున్నారు.
Also Read: నాకు మాట రాకున్నా అర్థం చేసుకున్నారు, నా డ్రైవర్ ఏడ్చేశాడు - సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!
2018 Movie OTT Release : నెల రోజుల్లోనే ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ '2018' - ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు