బిగ్ బాస్ బ్యూటీకి గోల్డెన్ ఛాన్స్ - పవన్ సినిమాలో శుభశ్రీ!
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న శుభశ్రీ రాయగురు తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. పవర్ నటిస్తున్న 'ఓజి' మూవీలో శుభశ్రీ కీలక పాత్ర పోషిస్తోంది.
రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న శుభశ్రీ రాయగురు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తన అందం, ఆటతీరుతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇంత తొందరగా పవర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకోవడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. డీటెయిల్స్ లోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన శుభశ్రీ రాయగురు హౌస్ లో ఐదు వారాలు ఉండి తన కూల్ ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంది. హౌస్ లో మంచి ఆట తీరును కనబరిచి అనూహ్యంగా ఐదవ వారంలో ఎలిమినేట్ అయిపోయింది. హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా రాణించి తన ఆట తీరితో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ఆటలో పుంజుకుంటున్న సమయంలోనే ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. అయితే హౌస్ లో ఉంది ఐదు వారాలే అయిన తన కూల్ ఆటిట్యూడ్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. హౌస్ నుండి ఎలిమినేట్. అయి అలా వచ్చిందో లేదో అంతలోనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ అందుకుంది. 'సాహో' డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న 'ఓజి' మూవీలో శుభశ్రీకి నటించే అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని శుభశ్రీ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలోనే దర్శకుడు సుజిత్ తో కలిసి దిగిన ఓ ఫోటోని పంచుకుంటూ తన సంతోషాన్ని వెల్లడించింది.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి 'ఓజి' మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఎక్సైటింగ్ గా ఉందని తెలిపింది. తాను పక్కా పవర్ స్టార్ ఫ్యాన్ అని, చాలా సంతోషంగా ఉందని చెప్పింది. నా టాలెంట్ ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన సుజీత్, కెమెరామెన్ రవిచంద్రన్, డివివి దానయ్య లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఇంతలా తనని ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ కి సైతం థాంక్స్ చెప్పింది శుభశ్రీ. దీంతో శుభశ్రీ సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ 'ఓజి' మూవీలో శుభశ్రీ ఎలాంటి పాత్ర చేస్తుందో అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇక 'ఓజి' విషయానికొస్తే.. ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టార్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుజిత్. సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, కోలీవుడ్ యాక్టర్స్ అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హాష్మి విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రంతోనే ఇమ్రాన్ హష్మీ సౌత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి కానుక విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : శర్వానంద్, కృతి శెట్టి సినిమా టైటిల్ మారుతోందా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
View this post on Instagram