![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sharwanand - Krithi Shetty : శర్వానంద్, కృతి శెట్టి సినిమా టైటిల్ మారుతోందా?
Sharwanand 35 Movie : శర్వానంద్, కృతి శెట్టి జంటగా యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రానికి తొలుత ఓ టైటిల్ అనుకున్నారు. అయితే... ఇప్పుడు ఆ టైటిల్ మారిందని తెలుస్తోంది.
![Sharwanand - Krithi Shetty : శర్వానంద్, కృతి శెట్టి సినిమా టైటిల్ మారుతోందా? Sharwanand Krithi Shetty movie to be titled Maname instead of Baby On Board Reports Sharwanand - Krithi Shetty : శర్వానంద్, కృతి శెట్టి సినిమా టైటిల్ మారుతోందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/24/73c576c931d30875876aa4d8480572ec1698133013868313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sharwanand New Movie to be titled as Maname : శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. 'భలే మంచి రోజు'తో దర్శకుడిగా పరిచయమైన, ఆ తర్వాత 'శమంతక మణి', 'దేవదాస్', 'హీరో' సినిమాలు తీసిన యంగ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమా టైటిల్ మారిందని సమాచారం.
బేబీ ఆన్ బోర్డ్ కాదు...
కొత్త టైటిల్ 'మనమే'!
శర్వానంద్, కృతి శెట్టి సినిమాకు తొలుత BOB ('బేబీ ఆన్ బోర్డ్') టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆ టైటిల్ పెడితే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశాలు తక్కువ అని భావించిన చిత్ర బృందం... 'మనమే' టైటిల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తోందట.
శర్వానంద్ తండ్రిగా విజయ్ సేతుపతి!?
ఈ సినిమాలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన విజయ్ సేతుపతి నటిస్తున్నారట. ఆయనది హీరో (Sharwanand) కి తండ్రి పాత్ర అని టాక్. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే... విజయ్ సేతుపతి (Vijay Sethupathi), కృతి శెట్టి (Krithi Shetty) అంటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా 'ఉప్పెన'. అందులో తండ్రి కుమార్తెలుగా నటించారు. ఇప్పుడీ సినిమాలో శర్వాకు విజయ్ సేతుపతి తండ్రి అంటే... కృతి శెట్టికి మామ అవుతారు అన్నమాట. భలే ఉంది కదూ ఈ కాంబినేషన్! ఈ రిలేషన్స్ మీద శ్రీరామ్ ఆదిత్య మంచి ఫన్నీ సీన్స్ ఏమైనా తీస్తారేమో చూడాలి! పెళ్లి తర్వాత శర్వా నటిస్తున్న చిత్రమిది.
Also Read : మెగా మాస్ ఫాంటసీ సినిమా - మ్యూజిక్ సిట్టింగ్స్‌తో చిరు సినిమా షురూ!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. లండన్ నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ 'హృదయం'తో తెలుగు ప్రేక్షకులు కొందరిని ఆయన ఆకట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'కి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ప్రస్తుతం నాని 'హాయ్ నాన్న', విక్రాంత్ 'స్పార్క్' సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నారు.
Also Read : అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : కృతి ప్రసాద్ & ఫణి కె వర్మ, కళా దర్శకుడు : జానీ షేక్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : విష్ణు శర్మ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)