అన్వేషించండి

Chiranjeevi 156 Movie : మెగా మాస్ ఫాంటసీ సినిమా - మ్యూజిక్ సిట్టింగ్స్‌తో చిరు సినిమా షురూ!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Chiranjeevi's Mega 156 Launch : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 156వ ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. బ్లాక్ బస్టర్ 'బింబిసార'తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ పతాకంపై  వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ రోజు సినిమా లాంఛనంగా మొదలైంది. ఫాంటసీ జానర్ సినిమా అని ఇంతకు చెప్పిన సంగతి తెలిసిందే. 

పూజా కార్యక్రమంలో దర్శకుడు వశిష్ఠకు చిరంజీవి, సురేఖ దంపతులు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా... దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్, మారుతి సహా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. 

మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ
సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం అనేది తెలుగు చిత్రసీమలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే... ఆ పద్ధతికి కొన్ని రోజులుగా బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మెగా 156 చిత్ర బృందం తీసుకు వచ్చింది. ఆస్కార్ పురస్కార గ్రహీతలైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ఠ సమక్షంలో చిరు హాజరు కాగా... మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు.  

సినిమాలో మొత్తం ఆరు పాటలు
సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు. పూజ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేయడమనే పద్ధతిని మళ్ళీ ఈ సినిమాతో తీసుకు వస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. సెలబ్రేషన్ సాంగ్ రికార్డ్ చేస్తున్నామని వివరించారు. దర్శకుడు వశిష్ఠతో పాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  అద్భుతమైన సినిమాలో తాను కూడా ఒక భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబోస్ చెప్పారు.  

Also Read : అగ్ర నిర్మాతకు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.   

Also Read 'దిల్' రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్ - అయితే అతి త్వరలో!

Chiranjeevi New Movie Update : నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆరు నెలలు చిత్రీకరణ జరుగుతుందట. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు... ఆరు నెలలు షూటింగ్ చేసి. ఆ తర్వాత ఆరు నెలలు సీజీ వర్క్ కోసం కేటాయించాలని ముందుగా డిసైడ్ అయ్యారట. ఇందులో ముగ్గురు కథానాయికలుగా అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget