అన్వేషించండి

Sreeleela : స్టార్ ప్రొడ్యూసర్‌కు శ్రీ లీల కండిషన్ - పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?

తెలుగులో ఓ అగ్ర నిర్మాణ సంస్థలో సినిమా చేసే అవకాశం వస్తే శ్రీ లీల 'నో' చెప్పారు. ఆ నిర్మాతకు ఓ కండిషన్ కూడా పెట్టారు. మరి, మహేష్ కోసం ఆ కండిషన్ పక్కన పెట్టేశారా?

Sreeleela Rejected Movies : తెలుగులో శ్రీ లీలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆమెను చూడటం కోసం థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరీ ముఖ్యంగా శ్రీ లీల డ్యాన్సులకు చాలా మంది ఫిదా అయ్యారు. 

'భగవంత్ కేసరి' సినిమా (Bhagavanth Kesari)తో డ్యాన్సులు మాత్రమే కాదు... తనలో మంచి నటి కూడా ఉందని శ్రీ లీల ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆమె చేసిన యాక్షన్ సీన్లకు క్లాప్స్ పడుతున్నాయి. ఇప్పుడు శ్రీ లీల చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా కొన్ని చిత్రాలను ఆమె వదులుకున్న సందర్భాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అయితే... శ్రీ లీల ఈ స్థాయికి రావడనికి ముందు తెలుగులో ఓ సినిమా వదులుకున్నారు. అదీ స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు నిర్మించిన సినిమా. ఎందుకో తెలుసా?

'దిల్' రాజు పరిచయం చేయాల్సిన హీరోయిన్!
శ్రీ లీల తెలుగు అమ్మాయి. అయితే... తెలుగు కంటే ముందు కన్నడలోశ్రీ లీల సినిమాలు చేశారు. తెలుగు తెరకు ఆమెను పరిచయం చేయాలని 'దిల్' రాజు అనుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఓ సినిమా కోసం శ్రీ లీల ఆడిషన్ కూడా ఇచ్చారు. అయితే... చివరకు వచ్చేసరికి ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని 'నో' చెప్పేశారు. ఎంత కష్టమైనా పడతానని, సోలో హీరోయిన్ సినిమా ఇవ్వమని 'దిల్' రాజుకు చెప్పేశారట! అదీ సంగతి!!

శ్రీ లీల పాటకు 'దిల్' రాజు కుమారుడి డ్యాన్స్!
శ్రీ లీల తమ సంస్థలో సినిమా చేయకపోయినా సరే... తన కుమార్తె హన్షితకు బాగా క్లోజ్ అయ్యిందని, త్వరలో ఆమెతో తప్పకుండా సినిమా చేస్తామని 'దిల్' రాజు చెప్పారు. 'ధమాకా'లో ఆమె పాటలకు తన కుమారుడు డ్యాన్స్ చేస్తాడని కూడా చెప్పారు. 

పవన్‌, మహేష్ కోసం పక్కన పెట్టారా?
ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని 'దిల్' రాజు సంస్థలో సినిమాకు 'నో' చెప్పిన శ్రీ లీల... ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న 'గుంటూరు కారం', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్లు ఉన్నారు. 

Also Read : 'దిల్' రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్ - అయితే అతి త్వరలో!

'గుంటూరు కారం'లో ముందు పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అయితే... శ్రీ లీల సెకండ్ లీడ్! ఆ తర్వాత పూజా హెగ్డే ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఆమె బదులు మీనాక్షి చౌదరి వచ్చారు. 'ఉస్తాద్ భగత్ సింగ్'లో శ్రీ లీలతో పాటు 'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమా చేయకూడదనే కండిషన్ శ్రీ లీల పక్కన పెట్టిసినట్లు ఉన్నారు.  

Also Read అద్దంలో నన్ను నేను చూసుకుని గుర్తుపట్టలేదు - బాలకృష్ణ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Madhuri Rathod Reaction : నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్
నన్ను బూతులు తిడుతూ అవమానించారు - ఈశ్వర్ సాయి భార్యపై మాధురి రాథోడ్ కంప్లైంట్
Chiranjeevi : చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
చిరు పంచె అంచు కదలదు... ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయ్ - అన్నయ్య జోలికొస్తే...
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Parvathipuram Manyam District Latest News: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల వీరంగం! పంటలు తొక్కేసి వ్యవసాయ మోటారులు ధ్వంసం!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Embed widget