By: ABP Desam | Updated at : 27 Mar 2023 03:48 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Bellamkonda Srinivas/Instagram
టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఛత్రపతి’. 2005 సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ కు మాస్ ఇమేజ్ వచ్చింది. ఆ ఏడాది సూపర్ హిట్ సినిమాలలో ఈ మూవీ ఒకటిగా నిలిచింది. వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా అంతే క్రేజ్ ను సంపాదించుకుంది ‘ఛత్రపతి’. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతారు. అంతలా ఈ మూవీ ప్రజాదరణ పొందింది. అయితే ప్రస్తుతం రిమేక్ లు, పాన్ ఇండియాల ట్రెండ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ‘ఛత్రపతి’ సినిమాను హిందీ వెర్షన్ లో రీమేక్ చేస్తున్నారు. అది కూడా బాలీవుడ్ డైరెక్టర్ కాదు తెలుగు డైరెక్టరే. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి.వి.వినాయక్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ పాత్రను హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రిలీజ్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ టీమ్.
వాస్తవానికి బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా ‘అల్లుడు శీను’ను తెరకెక్కించింది వి.వి.వినాయక్ నే. ఈ సినిమా 2014లో విడుదలై మంచి విజయాన్నిఅందుకుంది. నటుడిగా బెల్లంకొండ శ్రీనివాస్ ను నిలబెట్టింది. ఈ మూవీ తర్వాత శ్రీనివాస్ వరుసగా సినిమాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఓ భారీ ప్రాజెక్టు రాబోతోంది. అది కూడా రిమేక్ అందులోనూ హిందీ వెర్షన్‌లో. దీంతో ఈ సినిమాపై ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి. శ్రీనివాస్ కు హిందీలో ఇది మొదటి చిత్రం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి హిందీలో ఎలాంటి టైటిల్‌ను పెడతారో అని అంతా ఎదురు చూశారు. తాజాగా టైటిల్ ను రిలీజ్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. హిందీలో కూడా ‘ఛత్రపతి’ అనే టైటిల్ నే కొనసాగించారు. ఇందులో శ్రీనివాస్ కండలు తిరిగిన దేహంతో ఓ చేత్తో మరచెంబు పట్టుకొని సముద్రానికి ఎదురు నిలుచున్నట్లు కనిపిస్తోంది.
టాలీవుడ్ లో వి.వి. వినాయక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అయితే గత కొంత కాలంగా ఆయన తీస్తున్న సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని మళ్లీ డైరెక్షన్ చేస్తున్నారు వినాయక్. అయితే ఈసారి హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వినాయక్ టేకింగ్ స్టైల్ బాగుంటుంది, యాక్షన్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. అయితే ‘ఛత్రపతి’ లాంటి ఒక బలమైన సబ్జెక్ట్ ను హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఎలా చేశారో అనేదే ఇప్పుడు ప్రశ్న. మరి వినాయక్ రిమేక్ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కు కూడా మంచి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. మరి ఈ ఇద్దరికీ హిందీ ‘ఛత్రపతి’ ఎలాంటి ఫలితాన్నిఇస్తుందో చూడాలి. ఇక ఈ మూవీను మే 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు. అలాగే మూవీకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?
The wait is over #Chatrapathi in cinemas on 12th May, 2023. Cannot wait to show you all our hardwork & this action-packed dhamaka.🔥
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) March 27, 2023
Written by the one and only #VijayendraPrasad, directed by #VVVinayak.@Penmovies #Bss9 pic.twitter.com/VSLYTWQkrT
థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం సందడి చేసే సినిమాలు ఇవే!
'ఆది పురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఊహించని గెస్ట్!
త్రిషాకు తిరుగేలేదు - పెద్ద హీరోల పక్కన వరుస అవకాశాలు, ఆ ఒక్క సినిమాతో మారిన దశ!
Sulochana Passes Away: బాలీవుడ్లో తీవ్ర విషాదం, అలనాటి మేటి నటి సులోచన లట్కర్ కన్నుమూత
Pawan Kalyan Movie Kushi: ‘ఖుషి’ మూవీ చూసిన ఊర్వశి, పవర్ స్టార్ మూవీలో స్పెషల్ సాంగ్ కన్ఫామ్ అయినట్లేనా?!
ఒడిశాలో మరో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి పడిపోయిన గూడ్స్ ట్రైన్ - కానీ రైల్వేకి సంబంధం లేదట
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Bandi Sanjay on TDP: "టీడీపీ, బీజేపీ పొత్తు ఊహాగానాలే, బాబు అమిత్ షా, నడ్డాలను కలిస్తే తప్పేంటి"
WTC Final 2023: అదిరిందయ్యా రోహిత్! కొత్త జెర్సీల్లో టీమ్ఇండియా ఫొటోషూట్!