News
News
వీడియోలు ఆటలు
X

Summer Box office: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?

ఈ సమ్మర్ లో అదిరిపోయే సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. పలు భారీ బడ్జెట్ చిత్రాలు అభిమానులను అలరించబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

టాలీవుడ్ ఈ వేసవిలో సినీ లవర్స్ కు ఓ రేంజిలో ఆహ్లాదాన్ని పంచబోతోంది. అద్భుతమైన చిత్రాలను సినీ అభిమానులను అలరించబోతున్నాయి. పలు భారీ బడ్జెట్ సినిమాలు సైతం విడుదలకు రెడీ అయ్యాయి. యాక్షన్, రొమాన్స్, కామెడీ డ్రామా సహా పలు రకాల చిత్రాలు ఈ వేసవిని సినీ ప్రియులకు గుర్తుండిపోయేలా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేవో ఇప్పుడు చూద్దాం..

1. రావణాసురుడు

రవితేజ, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ‘స్వామి రా రా’, ‘శాకిని ఢాకిని’ లాంటి సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నసుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జయరామ్, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2. శాకుంతలం

సమంత హీరోయిన్ గా గుణ శేఖర్ తెరకెక్కించిన సినిమా ‘శాకుంతలం’.ఈ చిత్రం ఏప్రిల్ 14 న విడుదల కానుంది.  కాళిదాసు ప్రసిద్ధ రచన, అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, దేవ్ మోహన్, మధుబాల సహా పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

3. ఉగ్రం

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. ‘నాంది’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ ఫేమ్, ‘ఉగ్రం’ పేరుతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్‌లలో విడుదల కానుంది. నరేష్ సిన్సియర్ పోలీస్‌గా నటించగా, మర్నా అతడి భార్య పాత్రలో కనిపించనుంది.

4. విరూపాక్ష

కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం  ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో సాయి ధరమ్ తేజ్,  సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషించారు. పవన్ కల్యాణ్  ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ‘కాంతార’ చిత్రానికి పని చేసిన అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

5. ఏజెంట్

అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 28న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదలకానుంది.   ఇందులో కొత్త నటి సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.  హైదరాబాద్, ఢిల్లీ, హంగేరిలో ఈ సినిమాను షూట్ చేశారు. హిప్హాప్ తమిజా నేపథ్య సంగీతం సమకూర్చగా, రకుల్ హెరియన్ సినిమాటోగ్రఫీ చేశారు.   

6. కస్టడీ

నాగ చైతన్య, కృతి శెట్టి నటించిన తాజా సినిమా ‘కస్టడీ’.  మే 12న థియేటర్లలోకి రానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. తెలుగు,  తమిళ భాషలలో విడుదల కానుంది. అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్, శరత్‌కుమార్, ప్రేమి, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చారు.

7. హనుమాన్

తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మే 12న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.   

8. మీటర్

కిరణ్ అబ్బవరం తాజా మూవీ ‘మీటర్’. వేసవి సీజన్‌లో బాక్సాఫీస్ దగ్గర రవితేజ ‘రావణాసుర’ సినిమాతో పోటీ పడబోతోంది.  ఏప్రిల్ 7న థియేటర్లలోకి రాబోతోంది. కెరీర్ లో మొదటిసారిగా, కిరణ్ అబ్బవరం పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు.  కోలీవుడ్ నటి అతుల్య రవి ఈ చిత్రంలో కిరణ్‌కు జోడీగా నటించింది.  రమేష్ కడూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Read Also: హోటల్‌ గదిలో యువనటి ఆత్మహత్య, ప్రేమ వ్యవహారమే కారణమా?

Published at : 26 Mar 2023 07:49 PM (IST) Tags: Ravanasura Shaakuntalam Ugram Agent Virupaksha ​Ravanasura summer box office

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham June 2nd: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద

Ennenno Janmalabandham June 2nd: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద

Brahmamudi June 2nd: రాహుల్ సంగతి తెలిసి షాకైన కనకం కుటుంబం- స్వప్న అడ్డు తొలగించుకోవాలన్న రుద్రాణి

Brahmamudi June 2nd: రాహుల్ సంగతి తెలిసి షాకైన కనకం కుటుంబం- స్వప్న అడ్డు తొలగించుకోవాలన్న రుద్రాణి

Guppedanta Manasu June 2nd: ఎక్కడున్నారు రిషి సార్, కాలేజీలో వసుకి అవమానం- జగతిని హెచ్చరించిన ధరణి!

Guppedanta Manasu June 2nd: ఎక్కడున్నారు రిషి సార్, కాలేజీలో వసుకి అవమానం- జగతిని హెచ్చరించిన ధరణి!

Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్‌నర్‌తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!

Ileana Babymoon : డెలివరీకి ముందు పార్ట్‌నర్‌తో హాలిడేకి వెళ్లిన ఇలియానా!

Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?

Trivikram: సెంటిమెంట్‌ను ఫాలో అవ్వని త్రివిక్రమ్ - ‘గుంటూరు కారం’ ఫలితం ఎలా ఉంటుందో?

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

వాడ వాడలా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల జోష్‌- ప్రత్యేక సందేశం ఇవ్వనున్న కేసీఆర్

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?