Animal Release Date: ‘యానిమల్’లో 35 పాటలకు సెటప్ చేయాలి - రిలీజ్ వాయిదాపై స్పందించిన దర్శకుడు సందీప్ రెడ్డి
రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కిన 'యానిమల్' మూవీ రిలీజ్ తాజాగా వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వాయిదా పడడం పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు.
ప్రెజెంట్ సినీ ఆడియన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న 'యానిమల్' మూవీ కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోస్ట్ వైలెంట్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమా స్టోరీ పై గతంలో నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇవ్వగా, అప్పటినుంచి ఈ ప్రాజెక్టు పై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. కాగా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ని మొదట ఆగస్టు 11న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటికీ తాజాగా రిలీజ్ ని వాయిదా వేశారు.
అయితే అందుకు గల కారణాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి ఓ వీడియోలో రివీల్ చేశారు. ఈ మేరకు తాజా వీడియోలో సందీప్ రెడ్డి తాము క్వాలిటీ విషయంలో అసలు రాజీపడమని, ప్రత్యేకించి సినిమాలో ఏడు పాటలను ఐదు భాషల్లో అందించాలంటే దానికి సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 'యానిమల్' సినిమాని ఆగస్టు 11న ఎందుకు రిలీజ్ చేయలేదు? అలాగే కొత్త రిలీజ్ డేట్ ఏంటి? ఈ రెండు విషయాలపై క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి. "ఈ సినిమాలో ఏడు సాంగ్స్ ఉన్నాయి. అంటే ఐదు భాషలతో కలిపి మొత్తం 35. ఇన్ని పాటలను డిఫరెంట్ సెటప్ ప్లేసెస్, డిఫరెంట్ సెటప్ సింగర్స్ తో రికార్డ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్లే ఆగస్టు 11న సినిమాని విడుదల చేయలేమని మాకు అర్థమైంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ టీజర్ కు మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి థాంక్స్. ఈ కంటెంట్ సినిమాలో ఉండదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కానీ ఇదంతా మూవీలోని ఎపిసోడ్ నుంచి కట్ చేసింది. కాబట్టి తప్పకుండా ఉంటుంది" అని చెప్పారు.
ఇక పాటల గురించి ప్రస్తావిస్తూ.. "హిందీలో రికార్డ్ చేసిన సాంగ్స్ కు లిరికల్ గా ఎలాంటి అవుట్ ఫుట్ పొందామో, ఇతర లాంగ్వేజెస్ లో కూడా అలాంటి అవుట్ పుట్ కోసమే ట్రై చేస్తున్నాం. దీనికోసం టైం, ఎనర్జీ కేటాయించవలసి ఉంటుంది. అంతేకాకుండా ఇతర భాషల్లో ఈ పాటలు విన్న వాళ్ళకి డబ్బింగ్ వర్షన్ అనే ఫీలింగ్ కలగకూడదు అనేది నా ఆలోచన. అందుకే రిలీజ్ వాయిదా వేశాం. ఈ పనులన్నీ ముగిసిన తర్వాత డిసెంబర్ 1న 'యానిమల్' సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్న ప్రేక్షకులకు వీడియో, ఆడియో పరంగా బెస్ట్ క్వాలిటీ ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. కంటెంట్ ఎమోషనల్ ప్రెసెంటేషన్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. డిసెంబర్ 1న థియేటర్లోకి వచ్చి రణబీర్ కపూర్ విశ్వరూపాన్ని చూడండి" అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగా. కాగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటులు బాబి డియోల్, అనిల్ కపూర్, హీరోయిన్ పరిణితి చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read : తమన్నా మూడ్‌తో రానున్న ‘కావాలా’ - ఫన్నీగా రజినీకాంత్ ‘జైలర్’ ఫస్ట్ సింగిల్ ప్రోమో!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial