Anasuya Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ - అనసూయ పోస్ట్.. నెటిజన్ల సెటైర్లు
Kingdom Reaction: యాంకర్, ప్రముఖ హీరోయిన్ అనసూయ నెట్టింట ఓ సుదీర్ఘ పోస్ట్ చేయగా... దీన్ని పూర్తిగా చదవకుండానే కొందరు నెటిజన్లు విజయ్ 'కింగ్డమ్' మూవీకి లింక్ పెడుతూ ట్రోల్ చేశారు.

Netizens Reaction On Anasuya Bharadwaj Lengthy Post: సోషల్ మీడియాలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' గురించే చర్చ సాగుతోంది. గత రెండ్రోజులుగా కింగ్డమ్ హవానే కనిపిస్తోంది. ఈ టైంలో ప్రముఖ యాంకర్, హీరోయిన్ అనసూయ ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఏంటో చదివే ఓపిక కూడా జనాలకు లేకుండా పోయింది. అంత పెద్దగా ఏం రాసింది.. అందులో ఏముందో అన్నది కూడా చూడటం లేదు.. విజయ్ అన్న సినిమా వస్తుందంటే చాలు ఇలా ఏదో ఒకటి పోస్ట్ చేస్తావా? కాంట్రవర్సీకి దిగుతావా? అంటూ నెటిజన్లు అనసూయ మీద కామెంట్లు చేస్తున్నారు.
దీంతో అనసూయ వినమ్రంగా వారికి బదులు ఇచ్చారు. అసలు అనసూయ వేసిన ఆ పోస్ట్‌లో ఏముందో ఓ సారి చూద్దాం. తన వస్త్రధారణతో తనను జడ్జ్ చేయొద్దని అనసూయ వేడుకున్నారు. ఎవరికి నచ్చినట్టుగా.. ఎవరి కంఫర్ట్‌కు తగ్గట్టుగా వారు దుస్తులు ధరిస్తుంటారని, అలా డ్రెస్సింగ్‌ను బట్టి జడ్జ్ చేయకండని చెప్పుకొచ్చారు. బోల్డ్‌గా ఉంటున్నారంటే.. తక్కువ స్థాయి అని కాదని, బోల్డ్‌గా ఉంటున్నారంటే అగౌరవపర్చాల్సిందే అని కాదని అన్నారు.
డ్రెస్సింగ్ ప్రకారం జడ్జ్ చెయ్యొద్దు
తనను తన ఫ్యామిలీ ఎప్పుడూ జడ్జ్ చేయలేదని, తాను ఇద్దరు పిల్లల తల్లిని అని, తన భర్త గానీ, పిల్లలు గానీ ఎప్పుడూ కూడా అలా ఉండు.. ఇలా ఉండు అని తనని జడ్జ్ చేయలేదని అనసూయ అన్నారు. ఎవరి ఇష్టం వారిది అని, అందరూ తనలానే ఉండాలని కూడా తాను చెప్పడం లేదని తెలిపారు. ఎవరికి నచ్చినట్టుగా వారు ఉండే ఫ్రీడం ఉందని చెప్పారు. అందుకే డ్రెస్సింగ్‌ను బట్టి ఎవ్వరినీ ఎప్పుడూ జడ్జ్ చేయకండని చెబుతూ సుదీర్ఘమైన పోస్ట్ వేశారు.
Also Read: 'కింగ్‌డమ్' రివ్యూ: విజయ్ దేవరకొండ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? సినిమా హిట్టేనా?
విజయ్ 'కింగ్‌డమ్'కు లింక్
ఇక ఈ పోస్ట్‌ను చదవకుండానే కొంత మంది కొండన్న చిత్రానికి లింక్ చేశారు. దీంతో అనసూయ మళ్లీ సమాధానం ఇచ్చారు. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. నేను చెప్పింది వేరు.. మీరు అనుకుంటున్నది వేరు.. ఏ ఏ సినిమా రిలీజ్ అవుతోంది.. అని ట్రాక్ చేసేంత టైం, ఓపిక నిజంగా నాకు లేవండి అంటూ అనసూయ సమాధానం ఇచ్చారు. అనసూయ డ్రెస్సింగ్ మీద సోషల్ మీడియాలో ఎంతలా ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే దాన్ని చదవాలని... పూర్తిగా ఏమీ చూడకుండానే ఓ కన్‌క్లూజన్‌కు వచ్చి కామెంట్ చేయడం సరికాదంటూకొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.




















