Allu Arjun: అల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు... 'పుష్ప 2'కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
National Awards 2025: నెక్స్ట్ ఇయర్ ఇచ్చే నేషనల్ అవార్డుల్లో అల్లు అర్జున్ పేరు చూసే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ 'పుష్ప 1'కు ఇచ్చినప్పుడు మళ్ళీ 'పుష్ప 2'కు కూడా ఇస్తారా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నట విశ్వరూపం అంటున్నారు ఆడియన్స్ అంతా! ఇక, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ - గంగమ్మ జాతరలో అమ్మోరు ఆవహించినట్టు తాండవం చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు. 'పుష్ప 2' (Pushpa 2)లో ఆయన నటన గురించి ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అవార్డు వర్తీ పెర్ఫార్మన్స్ అని చెబుతున్నారు.
ఆల్రెడీ 'పుష్ప: ది రైజ్'కు అవార్డు వచ్చిందిగా!
'పుష్ప 1'లో అల్లు అర్జున్ నటనకు సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు... ఉత్తరాది జనాలు సైతం జేజేలు కొట్టారు. ఆయన నటనకు మెచ్చిన నేషనల్ అవార్డుల కమిటీ 'ఉత్తమ నటుడు' పురస్కారం ఇచ్చింది. పుష్పరాజ్ పాత్రకు ఆల్రెడీ అవార్డు ఇచ్చారు కనుక మళ్ళీ ఇస్తారా? అనే సందేహం కొంత మందిలో నెలకొంది. మరి, అవార్డు రూల్స్ ఏం చెబుతున్నాయి? బన్నీకి మరోసారి నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉందా? అంటే...
పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు గాను ఒకసారి అవార్డు ఇచ్చారు కనుక మళ్లీ ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు. నేషనల్ అవార్డులను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియమించిన అపాయింట్ చేసిన జ్యూరీ ఇస్తుంది. ఆ సభ్యులకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం... ఏ సినిమాకు ఆ సినిమాను ప్రత్యేకంగా చూస్తారు. అంతే తప్ప సీక్వెల్స్ (పార్ట్ 2)ను కన్సిడర్ చేయకూడదనే నిబంధనలు ఏవీ లేవు.
'పుష్ప 1'లో పుష్పరాజ్ క్యారెక్టర్ అల్లు అర్జున్ చేసినప్పటికీ... ఆ సన్నివేశాలు వేరు. ఆ సన్నివేశాలకు అనుగుణంగా ఆయన నటించిన సందర్భాలు లేవు. ఇప్పుడు 'పుష్ప 2'లో సన్నివేశాలు వేరు. ఒక్క గంగమ్మ జాతరలో నటనకు బన్నీకి మరోసారి నేషనల్ అవార్డు ఇచ్చేయవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి, 'పుష్ప 2' మరోసారి బన్నీకి అవార్డు కోసం సినిమాను సబ్మిట్ చేస్తుందో లేదో చూడాలి. 'పుష్ప 1'తో కంపేర్ చేస్తే... 'పుష్ప 2'లో అల్లు అర్జున్ నటనకు ఎక్కువ పేరు వచ్చిందనేది వాస్తవం.
తెలుగులో, ఆ మాటకు వస్తే... మన ఇండియన్ సినిమా హిస్టరీలో సీక్వెల్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఇప్పుడు, పాన్ ఇండియా సినిమాల కల్చర్ పెరిగిన తర్వాత సీక్వెల్స్ ఎక్కువ అయ్యాయి. ఇంతకు ముందు ఒక సీక్వెల్ లో నటనకు నేషనల్ అవార్డు అందుకున్న హీరో ఎవరూ లేరు. 'బాహుబలి 2' సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్, స్టంట్ కొరియోగ్రాఫర్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అలాగే, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు కూడా వచ్చింది.
ఎప్పటికీ ఆ రికార్డు అల్లు అర్జున్ పేరు మీదే!
నేషనల్ అవార్డుతో అల్లు అర్జున్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా ఆయన చరిత్రకు ఎక్కారు. ఇప్పుడు మరోసారి ఆయనకు అవార్డు వస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అవార్డు అందుకున్న హీరోగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేస్తారు.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?