News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Allu Arjun: ఐకాన్ స్టార్‌కు ఇన్‌స్టాగ్రామ్ అరుదైన గుర్తింపు - మార్నింగ్ రొటీన్‌ to ‘పుష్ప’ సెట్స్ వరకు, వీడియో అదుర్స్ అంతే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆయనకు సంబంధించి జీవిత విశేషాలతో పాటు ‘పుష్ప2’ షూటింగ్ వివరాలతో కూడిన వీడియోను అఫీషియల్ అకౌంట్ లో షేర్ చేసింది.

FOLLOW US: 
Share:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘పుష్ప’ చిత్రం పాన్ ఇండియా రేంజిలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2021లో రూ. 320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాగా కొత్త చరిత్ర లిఖించింది. ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలోని నటనగాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు.  ప్రస్తుతం ఈ బన్నీ ‘పుష్ప: ది రూల్’ మూవీ షూటింగ్‌లో ఉన్నాడు.

బన్నీ వీడియోను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు ఓ అరుదైన గుర్తింపు లభించింది. ఆయనకు సంబంధించిన జీవిత విశేషాలతో పాటు ‘పుష్ప2’ షూటింగ్ కు సంబంధించిన వివరాలతో కూడిన ఓ వీడియోను, ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌తో తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది. ఇందులో తన రోజువారి కార్యక్రమాలతో పాటు సినిమా షూటింగ్, కుటుంబంతో గడిపే క్షణాలను పొందుపర్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

View this post on Instagram
 
A post shared by Instagram (@instagram)

ఇన్ స్టాతో జత కట్టిన తొలి ఇండియన్ హీరో అల్లు అర్జున్

అటు ఇన్‌స్టాగ్రామ్‌తో  అధికారికంగా కొలాబరేట్ అయిన తొలి నటుడిగా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ ఇండియన్ స్టార్ కు లభించలేదు.  ఇన్‌స్టాగ్రామ్ బృందం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చి అల్లు అర్జున్‌కి సంబంధించిన కొన్ని వీడియోలను చిత్రీకరించింది. సుమారు ఒక రోజంతా ఇన్ స్టా టీమ్ ఆయనతోనే గడిపింది. ఆయన రోజు వారీ జీవిత విశేషాలను వీడియోల్లో బంధించింది. బన్నీ ఈ వీడియోను ఇవాళ ఇన్ స్టా గ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ నిన్న అల్లు అర్జున్ ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆయన పెట్టిన పోస్టు టాలీవుడ్ తో పాటు ఆయన అభిమానులలో ఆసక్తి కలిగించింది. బుధవారం ఉదయం 9 గంటలకు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు అల్లు అర్జున్‌ వెల్లడించాడు.  వ్యక్తిగత విశేషం ఏమైనా చెప్పబోతున్నారా? లేదంటే సినిమా అప్‌డేట్‌ ఇస్తారా? అని సినీ జనాలతో పాటు మూవీ లవర్స్ ఎదురు చూశారు. కానీ, ఇన్ స్టాలో ఆయన వీడియో విడుదల కావడంతో బన్నీ చెప్పిన సర్ ప్రైజ్ ఇదే అని అందరికీ అర్థం అయ్యింది. 

ఇన్ స్టాలో బన్నీకి భారీ ఫాలోయింగ్

అల్లు అర్జున్  సౌత్ ఇండస్ట్రీలో  మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఇన్ స్టాలో ఫాలోయర్స్ సంపాదించుకున్నారు. ఈయన ఇన్‌స్టాగ్రామ్  ఖాతాలో ఏకంగా 20 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.  దక్షిణాది చిత్ర పరిశ్రమలో  ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఆయనే కావడం విశేషం. నవంబర్‌ 2017 లో, అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి రోజు రోజుకూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ, అభిమానులను పెంచుకుంటూ వెళ్తున్నాడు. 

Read Also: డ్రగ్స్ కేసులో నాకు నోటీసులా? - స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 30 Aug 2023 09:57 AM (IST) Tags: Allu Arjun Instagram Allu Arjun-Instagram collaboration Allu Arjun Video

ఇవి కూడా చూడండి

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Sethupathi: అందుకే కృతి శెట్టిని తిరస్కరించాడట - విజయ్ సేతుపతిలా మన హీరోలు చేయగలరా?

Vijay Antony: మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Vijay Antony:  మూవీ ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన విజయ్ ఆంటోనీ, నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

Shiva Rajkumar: హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

Tiger Nageswara Rao Movie : రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో తమిళ బ్యూటీ - ఎవరో తెలుసా?

టాప్ స్టోరీస్

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

Chandrayaan 3: రేపటి నుంచి చంద్రుడిపై రాత్రి సమయం, ఇక భారత్‌కు నిరాశేనా?

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే

CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే