అన్వేషించండి

Nidhhi Agerwal : పవన్ ప్రధాని అయినా ఆశ్చర్యపడను - పవర్ స్టార్‌పై నిధి అగర్వాల్ ప్రశంసలు

Pawan Kalyan : పవన్ కల్యాణ్ భవిష్యత్తులో ప్రధాని అయినా తాను ఆశ్చర్యపోనని హీరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పవన్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Nidhhi Agerwal About Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానమని... అలాంటి అభిమానం కొందరికి మాత్రమే సాధ్యమని అన్నారు హీరోయిన్ నిధి అగర్వాల్. 'హరి హర వీరమల్లు'లో పవన్‌తో నటించిన ఆమె... తాజాగా ఓ పాడ్ కాస్ట్‌‌లో పవన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ పీఎం కావొచ్చు

సినిమాలతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ చేసిన సేవలతోనే ప్రజలు ఆయన్ను ఇష్టపడతారని అన్నారు నిధి. 'పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానం. అలాంటి క్రేజ్ ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే సొంతం అవుతుంది. ఫ్యాన్స్‌ను ఆయన కూడా అలాగే చూసుకుంటారు. 'హరి హర వీరమల్లు' మూవీకి వర్క్ చేసే టైంలో ఆయన్ను ప్రత్యక్షంగా చూశాను. సెట్‌లో అందరితో బాగా మాట్లాడతారు. ఆ మూవీ చేస్తున్న టైంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి 'మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు.' అని అనేవారు.

పవన్ ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వంద శాతం హార్డ్ వర్క్ చేస్తారు. ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా చెబుతారు. నిజాయతీగా ఉంటారు. భవిష్యత్తులో ఆయన ప్రధాని అయినా ఆశ్చర్యపడను.' అని అన్నారు.

Also Read : క్షుద్ర పూజలు... అంతు చిక్కని రహస్యం - టెర్రిఫిక్‌గా 'హనీ' టీజర్... లుక్ చూస్తేనే...

'ది రాజా సాబ్' మూవీపై...

రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రభాస్ 'ది రాజా సాబ్' మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోవడంపై నిధి అగర్వాల్ స్పందించారు. ప్రభాస్ వేటినీ పట్టించుకోరని తెలిపారు. 'ప్రభాస్ ఎలాంటి పాలిటిక్స్‌లో తలదూర్చడు. తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. ఆయన చాలా హుందాగా ఉంటారు. అందరితో ఎంతో అభిమానంగా నిష్కల్మషంగా మాట్లాడతారు. ఎవరైనా సరే ఆయన్ను కలిస్తే ఐదేళ్ల పిల్లాడిని కలిసినట్లే ఉంటుంది. ఎంత ఎదిగినా సింపుల్‌గా ఉంటారు.

కమర్షియల్‌గా ఉండడం రాదు. దేనికి కూడా లెక్కలేసుకోరు. ఆయనకు ఎలాంటి పీఆర్ టీం కూడా లేదు. తనతో కలిసి పని చేశాక ఆయనపై గౌరవం మరింత పెరిగింది. సినిమా కోసం ఫుల్ హార్డ్ వర్క్ చేస్తారు. రిజల్ట్ గురించి పట్టించుకోరు.' అంటూ చెప్పారు.

నెగిటివ్ పీఆర్ వ్యవస్థపై...

అలాగే, రీసెంట్‌గా బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన నెగిటివ్ పీఆర్ వ్యవస్థపైనా నిధి రియాక్ట్ అయ్యారు. ఒకరిని టాప్ ప్లేస్‌లోకి తీసుకెళ్లడానికే కాకుండా... తొక్కేయడానికి కూడా భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని అన్నారు. యాక్టర్స్‌కు కూడా ఎమోషన్స్ ఉంటాయని... నెగిటివిటీ వల్ల వాళ్లు మానసికంగా కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో పాటు వాళ్ల కుటుంబాలు కూడా తీవ్ర వేదన అనుభవిస్తాయని అన్నారు.

సరైన హిట్ కోసం...

2017లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్... తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. తెలుగులో 'సవ్య సాచి' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను, హీరో, హరి హర వీరమల్లు, ది రాజా సాబ్ మూవీస్ చేశారు. వీటిలో 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. గతేడాది 'హరి హర వీరమల్లు', ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'రాజా సాబ్' సైతం నిరాశపరిచాయి. రాబోయే రోజుల్లో సరైన హిట్ కొట్టేందుకు వెయిట్ చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
Advertisement

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Embed widget