Ali Birthday : యాక్టర్ అలీ - మళ్ళీ తెలుగు సినిమాల్లో బిజీ బిజీ!
Ali Upcoming Telugu Movies : నటుడిగా అలీ మళ్ళీ బిజీ అవుతున్నారు. ఆయన పలు కొత్త సినిమాలకు సంతకం చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఆయా సినిమాల వివరాలు వెల్లడించారు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో అలీ (Telugu Actor Ali) ఒకరు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్... వంటి అగ్ర హీరోలతో పాటు వాళ్ళకు ముందు తరంలోని హీరోలతో, వాళ్ళ తర్వాత తరం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ తదితరులతోనూ, ఈ తరం యువ హీరోలతో కూడా అలీ నటించారు. ప్రేక్షకుల్ని నవ్వించారు. అయితే... కొంత కాలంగా ఆయన సినిమాలు తగ్గిస్తూ వచ్చారు.
ఒక వైపు టాక్ షోలు, మరో వైపు రాజకీయ పరమైన కార్యక్రమాలు ఉండటంతో ఈ మధ్య కాలంలో వెండి తెరపై అలీ సందడి తగ్గింది. సినిమాల్లో మళ్ళీ ఆయన బిజీ బిజీ అవుతున్నారు. ఈ రోజు (అక్టోబర్ 10న) అలీ పుట్టిన రోజు (Ali Birthday). ఈ సందర్భంగా తాను చేస్తున్న కొత్త సినిమా విశేషాలను ఆయన తెలిపారు. మళ్ళీ సినిమాల్లో అలీ బిజీ బిజీ అవుతున్నారని చెప్పాలి.
అలీ చేతిలో అరడజను సినిమాలు
Ali New Movies In Telugu : అల్లు శిరీష్ హీరోగా నటించిన డిఫరెంట్ సినిమా 'బడ్డీ'. హీరోతో పాటు ఓ టెడ్డీ బేర్ ప్రధాన పాత్రధారి. ఆ సినిమాలో అలీ కీలక పాత్ర చేశారు. అలాగే, తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'గీతాంజలి 2' సినిమాలో కూడా ఆయన నటిస్తున్నారు. ఇంకా 'మిస్ కాళికా దేవి మిస్సింగ్'తో పాటు మరో నాలుగైదు సినిమాలు ఉన్నాయి.
అలీ మాట్లాడుతూ ''నేను 43 సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నాను. ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ప్రస్తుతం అర డజనుకు పైగా సినిమాల్లో నటిస్తున్నా. సినిమాలతో పాటు యాడ్స్, టీవీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నాను'' అని చెప్పారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన బంధు మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
త్వరలో కొత్త టాక్ షో
అలీ 1981లో బాల నటునిగా తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. హాస్య నటుడిగా ఎన్నో సినిమాల్లో నవ్వించారు. స్టార్ కమెడియన్ ఆయన. ఆ తర్వాత 28 ఏళ్ల క్రితం 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన 'యమలీల'తో హీరోగా విజయం అందుకున్నారు. హీరో అయ్యాక కూడా హాస్య నటుడిగా సినిమాలు చేయడం మానలేదు. తనకు సూటయ్యే పాత్రలు వచ్చినప్పుడు హీరోగా చేశారు.
Also Read : రాజమౌళి @ 50 - భారతీయ సినిమా బ్రాండ్ అంబాసిడర్ నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్ కుంభస్థలమే
Ali Talk Shows : పలు సినిమాల్లో నటించిన తర్వాత బుల్లితెర యాంకర్ అవతారంలో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. 'అలీ 369', 'అలీతో జాలీగా', 'అలీతో సరదాగా' షోస్ హిట్ అయ్యాయి. త్వరలో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలిసింది.
Also Read : మైత్రికి 'సలార్' నైజాం - ఇది ఏషియన్ సునీల్, 'దిల్' రాజుకు గట్టి పోటీయే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial