ముంబైలో ఉత్తరాది అమ్మాయిల పోటీ తట్టుకుని హిందీలో సక్సెస్ అయిన తెలుగు అమ్మాయి శ్రేయా ధన్వంతరి. సినిమాలు, వెబ్ సిరీస్ లు... సిల్వర్ స్క్రీన్ & డిజిటల్ స్క్రీన్లలో దూసుకు వెళుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'ముంబై డైరీస్' సీజన్ 2తో అక్టోబర్ 6న ఓటీటీలో సందడి చేస్తున్నారు. 'ముంబై డైరీస్ 2' ప్రచార కార్యక్రమాల్లో శ్రేయా ధన్వంతరి ఈ డ్రస్ లో సందడి చేశారు. ఈ ఏడాది ఓటీటీలో శ్రేయా ధన్వంతరికి రెండో రిలీజ్ ఇది! 'గన్స్ అండ్ గులాబ్స్'లో కూడా ఆవిడ నటించారు. 'చుప్' సినిమాలోనూ దుల్కర్, శ్రేయా జోడీగా కనిపించారు. అక్కినేని నాగచైతన్య 'జోష్'లో శ్రేయా ధన్వంతరి ఓ రోల్ చేశారు. మధుర శ్రీధర్ దర్శకత్వం వహించిన 'స్నేహ గీతం' సినిమాలో కథానాయికగానూ శ్రేయ నటించారు. 'జోష్', 'స్నేహగీతం' తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యారు శ్రేయా ధన్వంతరి. శ్రేయా ధన్వంతరి (All Images Courtesy : shreyadhan13 / Instagram)