పట్టు చీరలో మెహ్రీన్ అందాలు - చూడ్డానికి రెండు కళ్ళు చాలవు! నాని సరసన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. 'రాజా ది గ్రేట్', 'మహానుభావుడు' 'ఎఫ్2', 'ఎఫ్3' వంటి సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోషూట్స్ తో అందాలను ఆరబోస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రీసెంట్ గా ‘ఎఫ్3’తో మంచి సక్సెస్ ను అందుకున్న ఈ బ్యూటీ.. తాజాగా 'స్పార్క్' అనే చిత్రంలో నటిస్తోంది. పట్టుచీరలో అచ్చ తెలుగమ్మాయిల మెరిసిపోతున్న మెహ్రీన్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరు ఓ లుక్కేయండి. Photo Credit : MEHREEN/Instagram