సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అందాల భామ పాయల్ రాజ్ పుత్ ఒకరు. తన బోల్డ్ ఫొటో షూట్ లతో కుర్రకారును ఆకట్టుకుంటూ నెట్టింట రచ్చ చేస్తుంది. షూటింగ్ లో భాగంగా ఇటీవల లడఖ్ వెళ్లిన ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు అక్కడి విశేషాలను పంచుకుంటూ వస్తోంది. లేహ్ ప్రాంతంలో కనిపించే అరుదైన మూగ జీవాలతో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. తాజాగా బాక్ట్రియన్ ఒంటెకు ముద్దు పెడుతూ పాయల్ పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాయి. వైరల్ గా మారిన ఈ ఫోటోలకు 'మాటల్లో చెప్పలేని ఆప్యాయత & ముద్దులు' అని క్యాప్షన్ పెట్టింది. 'చన్నా మెరేయా' అనే పంజాబీ సినిమాతో తెరంగేట్రం చేసిన పాయల్.. 'Rx 100' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీలోనే బోల్డ్ పాత్రలో నటించి యువ హృదయాలను కొల్లగొట్టింది కానీ, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోయింది. సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసులలో నటిస్తోంది. 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ నటించిన 'మంగళవారం' మూవీ నవంబర్ 17న రిలీజ్ కానుంది.