News
News
వీడియోలు ఆటలు
X

Vikram: విక్రమ్‌తో సినిమా చేయాలనుకున్నా, స్పందించకపోవడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నా- అనురాగ్ కశ్యప్

సౌత్ స్టార్ హీరో విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నా, తను స్పందించలేదని చెప్పారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అతడితో చేయాలి అనుకున్న సినిమాను రాహుల్ భట్ తో తీశానని వెల్లడించారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన చిత్రం ‘కెన్నెడీ‘ ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపిక అయ్యింది. మిడ్‌నైట్ స్క్రీనింగ్ కోసం ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ మూవీ ప్రీమియర్ త్వరలోనే జరగనుంది.  ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న ఆయన, ఈ చిత్రం గురించి కీలక విషయాలు తెలిపారు.   

విక్రమ్ ను ఊహించుకుని కథ రాసిన అనురాగ్

‘కెన్నెడీ’ చిత్రంలో రాహుల్ భట్, సన్నీ లియోన్, అభిలాష్ తప్లియాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కథ నిద్రలేమితో బాధపడుతున్న ఒక మాజీ పోలీసు చుట్టూ తిరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని స్టోరీతో ఈ మూవీ రూపొందింది. కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా ఫిల్మ్ కంపానియన్ తో అనురాగ్ మాట్లాడుతూ, వాస్తవానికి ఈ సినిమాను రాహుల్ భట్ తో చేయాలి అనుకోలేదన్నారు. తను హీరోగా మరొకరిని ఊహించుకుని ఈ సినిమా కథను రాసినట్లు చెప్పారు. అందుకే ఈ చిత్రానికి ‘కెన్నెడీ’ అనే పేరును కూడా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇంతకీ తను ఊహించుకున్న హీరో మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విక్రమ్.   

‘కెన్నెడీ’ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే?   

వాస్తవానికి విక్రమ్ అసలు పేరు కెన్నెడీ. ఆయనను హీరోగా భావించి ఈ సినిమాను రూపొందించనున్నారు కాబట్టి ఈ చిత్రానికి ‘కెన్నెడీ’ అని పేరు పెట్టారు. కథ రెడీ అయ్యాక విక్రమ్ ను సంప్రదించినట్లు అనురాగ్ చెప్పారు. అయితే, తాను ఎన్నిసార్లు సంప్రదించినా, విక్రమ్ స్పందించలేదని చెప్పారు. ఆయన నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో రాహుల్ భట్ ను హీరోగా తీసుకున్నట్లు చెప్పారు. తాను ఇచ్చిన స్ర్కిప్ట్ రాహుల్ కు చాలా నచ్చిందన్నారు. చాలా అద్భుతం అని చెప్పినట్లు వివరించారు. ఈ సినిమా కోసం రాహుల్ ఏకంగా 8 నెలల సమయం కేటాయించినట్లు అనురాగ్ చెప్పుకొచ్చారు.    

తాజాగా లియోనార్డో డికాప్రియో, రాబర్ట్ డి నీరో కలిసి నటించిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మార్టిన్ స్కోర్సెస్  ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’ ప్రీమియర్‌కు అనురాగ్ హాజరయ్యారు. అతడితో పాటు దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే కూడా ఉన్నాడు. అనురాగ్ కేన్స్ 2023లో తన ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేస్తూనే ఉన్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేన్స్  ఫిలిం ఫెస్టివల్ కు సంబంధించి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉన్నారు.

View this post on Instagram
 
A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

View this post on Instagram
 
A post shared by Anurag Kashyap (@anuragkashyap10)

ఇక  అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా, ఆమె ప్రియుడు షేన్ తో తాజాగా నిశ్చితార్థం జరిగింది. వీరి నిశ్చితార్థం ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆలియా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  

Read Also: విజయ్, వెంకట్ ప్రభు కాంబోలో ప్రతిష్టాత్మక చిత్రం, ఇంట్రెస్టింగ్ వీడియోతో మూవీ రివీల్!

Published at : 22 May 2023 11:16 AM (IST) Tags: Chiyaan Vikram anurag kashyap Kennedy Movie

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!