BulBul Tarang: రవితేజ కోసం సిద్ శ్రీరామ్ మ్యాజికల్ సాంగ్
రవితేజ నటిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలకపాత్రలో కనిపించనున్నారు.
ముందుగా మార్చి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ఆరోజు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఉండడంతో వాయిదా వేయక తప్పలేదు. జూన్ 17న సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటినుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో సినిమా నుంచి ఓ పాటను విడుదల చేసింది.
'తూలే గిరగిరమని బుర్రే ఇట్టా' అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఈ మెలోడీ అభిమానులను ఆకట్టుకుంటుంది. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. ఇప్పటికే 'ఖిలాడి' షూటింగ్ పూర్తి చేశారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' అనే సినిమా లైన్ లో పెట్టారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా నిర్మాణదశలో ఉన్నాయి.
Also Read: వీరమల్లు షూటింగ్‌కు ముందు పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి పూజ
View this post on Instagram
View this post on Instagram