Brahmamudi March 31st: కనకాన్ని కలిసేందుకు గుడికి వెళ్తున్న స్వప్న- అపర్ణ మీద విరుచుకుపడిన ఇంద్రాదేవి
రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
నైట్ ఏం జరిగిందో అడుగుదామని కావ్య దగ్గరకి వచ్చి మాట్లాడకుండా వెళ్లిపోతుంటే మనసులో మాట్లాడుకుంటే ఎలా అని అంటుంది. రాత్రి నీ గదిలో మన మధ్య ఏం జరగలేదు కదా అంటే ఎందుకు జరగలేదు జరిగింది కదా అని కావ్య కాసేపు ఆడుకుంటుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి ఏం ప్రయోజనమని వంకరగా మాట్లాడుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిజం రాబట్టాలని చూస్తాడు.
రాజ్- కావ్య: నిన్న రాత్రి జరిగిన దాని గురించి చెప్పవా. అంతా కూతుహులంగా ఉందా తెలుసుకోవాలని. ఏం జరగలేదని తెలిస్తే నా శీలం మీద పడిన మచ్చని తొలగించుకుంటాను ప్లీజ్, నిజం చెప్పమని అంటాడు. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నా వారం తర్వాత కనిపించండి మిస్టర్ డిఫెక్ట్ అప్పుడు చెప్తాను. ఈ పొగరే వద్దని చెప్తున్నా.. అవునా అయితే సరే రిక్వెస్ట్ చేస్తే చెప్తానని కావ్య బెట్టు చేస్తుంది. కోపంగా కావ్య మీదకి వెళ్లబోతుంటే కళ్యాణ్ వస్తాడు. కొత్త కవిత్వం చెప్తాను విను అని తిక్క తిక్కగా మాట్లాడి వెళ్ళిపోతాడు.
Also Read: గుండెల్ని పిండేసే సీన్, ఖైలాష్ పంపిన ఫోటోస్ చూసేసిన యష్- వేద తన తప్పులేదని నిరూపించుకుంటుందా?
రాహుల్ మీద అలిగి కూర్చుంటుంది స్వప్న. అమ్మని కలవాలి ఏర్పాట్లు చేయమని స్వప్న రాహుల్ ని అడుగుతుంది. ఎందుకని అంటాడు. మా చెల్లి మీ ఇంట్లో అందరి ముందు నన్ను బ్యాడ్ చేసింది, మా అమ్మ దగ్గర కూడా చెప్పి ఉంటుంది తనని నా దారిలోకి తెచ్చుకుంటే చెల్లి మీద రివెంజ్ తీర్చుకుంటానని అంటుంది. గుడికి వెళ్తున్న కనకానికి స్వప్న కాల్ చేస్తుంది. గొంతు మార్చి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసరికి కనకం లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. పాతిక లక్షలు లోన్ ఇస్తామని చెప్పేసరికి రాహుల్ అది విని బిత్తరపోతాడు. బంజారా హిల్స్ దుర్గమ్మ గుడికి వెళ్తున్నానని చెప్తుంది. అమ్మ ఎక్కడ ఉందో తెలిసిపోయింది వెళ్ళి కలుస్తానని అంటుంది.
మన ఆచారం ప్రకారం గుడికి తీసుకెళ్ళి ముడుపు కట్టించి పూజ చేయింది భర్త చేతితో ప్రసాదం తినిపించాలని రాజ్ తాతయ్య చెప్తాడు. నో అని గట్టిగా అరుస్తాడు. ఇష్టంలేని పెళ్లి చేసుకుని ఇప్పటికే అల్లాడిపోతున్నా మళ్ళీ నన్ను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయవద్దని చెప్తాడు. ఈ విషయంలో రుద్రాణి, అపర్ణ కాసేపు వాదించుకుంటారు. ఇది దైవ ఘటన జరిగింది ఏదో జరిగిపోయిందని గుడికి వెళ్లాలని పెద్దాయన చెప్తాడు. ఇంద్రాదేవి రాజ్ మీద సీరియస్ అవుతుంది.
ఇంద్రాదేవి: శోభనం వద్దని చెప్పావు ఆగిపోయాము కానీ నువ్వు ఏం చేశావ్ ఇంటి కోడలు అంగీకారం లేకుండా తన గదికి వెళ్ళావ్. ఇష్టం లేదన్న వాడివి మాట మీద నిలబడ్డావా? లేదు కదా
అపర్ణ: ఇష్టంలేని పెళ్లి చేశారు ఎందుకు ఇంకా వాడిని బలవంతం చేస్తారు
ఇంద్రాదేవి: చాలు ఆపు.. నీకు ఇష్టం లేదని చెప్పు నీ అయిష్టాన్ని వాడికి అంటించకు. ఈ ఇంటికి యజమాని నా భర్త. దుగ్గిరాల ఇంటికి పేరు వచ్చిందంటే నా భర్త సీతారామయ్య వల్లే. అంత పెద్ద దానివి అయ్యావా మావయ్యకి ఎదురు చెప్తావా ఇప్పటికిప్పుడే నువ్వు మీ అమ్మ నా భర్తకి క్షమాపణ చెప్పండి
అపర్ణ: మిమ్మల్ని ఎదిరించే ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి లేదు కొడుకు మీద ఉన్న ఆపేక్షతో మాట్లాడాను నన్ను క్షమించండి మావయ్య
Also Read: కావ్యకి సారీ చెప్పిన రాజ్- బయటపడిన అపర్ణ దాష్టీకం, కన్ఫ్యూజన్ లో రుద్రాణి
ఇంద్రాదేవి: రాజ్ నువ్వు మీ అమ్మ నీ భార్య రెడీ అయి రండి గుడికి వెళ్దాం
అపర్ణ చేసేదేమి లేక రాజ్ ని రెడీ అవమని చెప్తుంది. రుద్రాణి నవ్వుతుంటే తన దగ్గరకి వెళ్ళి ఏదో ఒక రోజు నీ కొడుకు వల్ల నువ్వు అవమానాలపాలవుతావు గుర్తు పెట్టుకోమని చెప్తుంది. నా కొడుకు వల్ల మీ ఫ్యామిలీ అంతా అవమాన పాలు కాకుండా చూసుకొండని మనసులో అనుకుంటుంది. రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొస్తాడు. నాకు గుడికి వెళ్ళడం ఇష్టం లేదని రాజ్ అంటే భయపడొద్దు ముసుగు వేసుకుంటాలే అంటుంది. నీతో గుడికి రావడం నాకు ఇష్టం లేదని అంటే నాకు కూడా సేమ్ ఫీలింగ్ అంటుంది. ఇద్దరూ కాసేపు కీచులాడుకుంటారు.