By: ABP Desam | Updated at : 30 Mar 2023 08:07 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
రాజ్ మెల్లగా కావ్య గదిలో నుంచి బయటకి రావడం చూసి అందరూ శోభనం జరిగిపోయిందని అనుకున్నారు. కొడుకు షర్ట్ మీద బొట్టు ఉండటం చూసి అపర్ణ కోపంతో రగిలిపోతుంది. ఆ అమ్మాయిని భార్యగా అంగీకరించలేదని ఇప్పుడు ఏంటి ఈ పనని అపర్ణ అంటుంది. రాత్రంతా ఈ గదిలోకి ఎలా వచ్చానో తనకి నిజంగా తెలియదని రాజ్ అంటాడు. ఏయ్ దొంగ మాకు అంతా తెలుసులే అని అందరూ శోభనం జరిగిపోయినట్టుగా మాట్లాడతారు. నిజంగా నేను తొందరపడలేదు. అసలు ఆ కళావతి అంటే ఇష్టం లేదని రాజ్ చెప్తున్నా నమ్మలేనని అపర్ణ అంటుంది. అప్పుడే కావ్య తులసి కోటకి పూజ చేసి లోపలికి వస్తుంటే రాజ్ రాత్రంతా నీ గదిలోనే ఉన్నాడా అని రుద్రాణి అడుగుతుంది. నీ గదికి ఎందుకు వచ్చానో చెప్పమని అమాయకంగా అడుగుతాడు. నువ్వు రాత్రి నీ గదిలోనే ఉన్నావా అని రుద్రాణి అడుగుతుంది ఉన్నానని అనేసరికి వాయమ్మో ఏం జరగలేదత్త అని రాజ్ అంటాడు.
రెడీ అవమంటే మనసు ముఖ్యమన్నావ్ మరి ఇప్పుడు ఏమంటావని ఇంద్రాదేవి అంటుంది. దొరికిందే సందని రుద్రాణి ఆరోజు నేను కుటుంబం కోసం చేసిన పని కుటుంబాన్ని నిలబెట్టిందని రుద్రాణి అంటుంది. రాత్రి ఏం జరిగిందో చెప్పమని కావ్యని నిలదీస్తుంది. నువ్వే నా కొడుకుని నీ గదికి రప్పించుకున్నారు కదా అడుగుతుంది.
కావ్య: నేను బయటకి రాకూడదని మీరు నా గది గడియ పెట్టి వచ్చారు నేను బయటకి ఎలా వస్తాను
Also Read: ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దామన్న యష్- విన్నీ కుట్రతో మళ్ళీ మొదటికొచ్చిన వేద జీవితం
ఇంద్రాదేవి: మరి ఇంత దారుణంగా ఎలా చేస్తావ్
రాజ్: మమ్మీ నువ్వు ఇలాంటి పని చేశావా ఎంత కోపం ఉంటే మాత్రం ఇలాంటి పనా
కావ్య: నేను చెప్పకూడదని అనుకున్నా కానీ తప్పలేదు
రాజ్: నాకు అసలు ఏం గుర్తు లేదత్త ఈ కళావతి రూమ్ కి ఎప్పుడు వెళ్లానో ఎందుకు వెళ్ళానో గుర్తు లేదు
కళ్యాణ్: నాకు తెలుసు.. రాత్రి అన్నయ్య తాగేసి తన గదిలోకి వెళ్ళాడు
రాజ్ నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచని అపర్ణ ఆశ్చర్యంగా అడుగుతుంది. వద్దని చెప్తున్నా వదిన గదిలోకి వెళ్ళాడు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదని కళ్యాణ్ అంటాడు. తనకి ఎందుకు చెప్పలేదని అపర్ణ అంటే నా భార్య గదిలోకి నేను వెళ్తాను నీకెందుకన్నాడు అందుకే చెప్పలేదని కళ్యాణ్ చెప్పేస్తాడు.
అపర్ణ: రెండు తప్పులు చేశావ్.. తాగడం ఒక తప్పు అయితే నీకిష్టం లేదని చెప్పి నిన్ను ఇష్టపడని భార్య గదిలోకి వెళ్ళడం మరొక తప్పు
రుద్రాణి: రాహుల్ ని శోభనం చెడగొట్టమంటే తాగించి కార్యం జరిగేలా చేశాడని తిట్టుకుంటుంది. ఇంత దారుణంగా ప్రవరిస్తావా ముందు తనకి సారీ చెప్పమని రాజ్ తాతయ్య కఠినంగా అంటాడు. మమ్మీ చేసిన పనికే గిల్టీగా ఉంది నేను చేసిన పనికి ఇంకా ఎంబ‌్రాసింగ్ గా ఉంది. నీ మీద ఎప్పటికీ కోపం తగ్గదు, కానీ రాత్రి జరిగిన దానికి సారీ చెప్పేసి రాజ్ వెళ్ళిపోతాడు.
Also Read: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య
కనకం తన పిల్లల గురించి తలుచుకుని బాధపడుతుంది. రాజ్ తల్లి దగ్గరకి మాట్లాడటానికి వస్తాడు కానీ అపర్ణ వినిపించుకోదు. రాహుల్ తాగించాడని చెప్తే మమ్మీ అసలు క్షమించదని రాజ్ మనసులో అనుకుని నిజం బయట పెట్టడు. నువ్వు చేసిన తొందరపాటు వల్ల ఆ అమ్మాయిని భార్యగా ఒప్పుకున్నట్టు అయ్యింది. తనని కోడలిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే నాలో ఇంకొక కోణం చూడాల్సి వస్తుందని అపర్ణ అంటుంది. ఏ తప్పు చేయలేదని తనతోనే అందరి ముందు ఒప్పిస్తానని రాజ్ చెప్తాడు కానీ అపర్ణ నమ్మదు. కావ్య బొమ్మలకు రంగులు వేసుకుంటుంటే రాజ్ వచ్చి నిజం తెలుసుకోవాలని అనుకుంటాడు.
Bigg Boss Season 7 Telugu: అబ్బా.. పిండేశాడు - చోరీ టాస్క్లో జీరో, పండ్ల టాస్కులో హీరో - యావర్కు కలిసొచ్చిన చివరి ఆట, కానీ..
Bigg Boss Season 7 Telugu: అక్కడ చెయ్యి తియ్ - యావర్తో శోభాశెట్టి ఫైట్, చోరీ టాస్క్లో చివరి ట్విస్ట్ అదుర్స్
Bigg Boss Season 7 Telugu: నీకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు, అందుకే అలా చేస్తున్నావ్ - యావర్పై శివాజీ మండిపాటు
నీ ఇంట్లో వాళ్లు ఇలాగే పెంచారా? నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది - నటి కస్తూరి ఫైర్, ‘బిగ్ బాస్’పై రచ్చ!
Tiger Nageswara Rao: కొత్త ఐడియాతో ‘టైగర్ నాగేశ్వర రావు’ - ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా విడుదల కాని భాషలో!
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
/body>