By: ABP Desam | Updated at : 29 Mar 2023 09:29 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
దివ్యకి పెళ్లి చేద్దామని నందు అంటాడు. ఇప్పటి వరకు పిల్లల బాధ్యతలు నువ్వు తీసుకున్నావ్ ఇప్పుడు నేను తీసుకుంటాను. దివ్య బాధ్యతని పూర్తిగా తనే తీసుకుంటానని నందు చెప్తాడు. నాలాగా మీరు ఒంటరి మనిషి కాదు మీకు భార్య ఉందని తులసి అంటే లాస్యని కాదని నువ్వు ఏమి చేయలేవని పరంధామయ్య కూడా వంత పాడతాడు. ఏం జరిగినా నేను చూసుకుంటానని మాట ఇస్తాడు. కోపం వద్దని తులసి అంటుంటే ఫ్రెండ్ వి నువ్వు చెప్తే నేను ఎందుకు వినకుండా ఉంటానని నందు అనేసరికి సంతోషిస్తుంది. ప్రియ జీవితం నిలబెట్టానని దివ్య సంతోషంగా తల్లి దగ్గరకి వచ్చి చెప్తుంది. గొప్ప వాళ్ళని ఎదిరిస్తే వాళ్ళు తేలికగా తీసుకోరని భయంగా ఉందని తులసి అంటుంది. రాజ్యలక్ష్మి మంచివారు అన్యాయాన్ని సహించని వ్యక్తి కాబట్టి ఒప్పుకున్నారు. ఆవిడ తిరగబడి ఉంటే ఏంటి పరిస్థితని తన మనసులో భయాన్ని చెప్తుంది.
Also Read: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్
దివ్య తల్లితో మాట్లాడుతూ ఉండగా కొరియర్ వస్తుంది. అది విక్రమ్ పంపిన కొరియర్ అనుకుని అమ్మకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బొకే తీసుకుంటుంది. అది చూసి మురిసిపోతుంటే తులసి వచ్చి కదిలిస్తుంది. ఎవరి దగ్గర నుంచి వచ్చిందని కాసేపు ఆట పట్టించి వెళ్ళిపోతుంది. దివ్య దాన్ని గుండెలని హత్తుకుని సంతోషంగా ఉంటుంది. ప్రియ రాజ్యలక్ష్మి చాలా మంచిదని అనుకుంటుంది. అప్పుడే పని మనిషి అన్నం, పచ్చడి వేసుకుని వస్తుంది. ఇంట్లో వాళ్ళు విందు భోజనం చేస్తారు కదా నాకు అదే తీసుకుని రా అని ప్రియ అంటుంది. పని వాళ్ళకి కూడా మంచి భోజనమే ఉంటుంది కానీ మీకు మాత్రమే పచ్చడి వేసి పెట్టమని చెప్పారు. నువ్వు అనుకున్నట్టు మీ అత్త పైకి మంచిగానే కనిపిస్తుంది కానీ కనిపించని రాక్షసి ఉందని చెప్తుంది. ఇంత మోసమా అని ప్రియ చాలా బాధపడుతుంది. ఈ ఇంట్లో విక్రమ్ బాబు ఉన్నారు మంచి వాళ్ళు కానీ తల్లి మాట జవదాటడని చెప్తుంది.
Also Read: విన్నీని హగ్ చేసుకుని ఐలవ్యూ చెప్పిన వేద- ముక్కలైన యష్ హృదయం
ప్రేమని పంచి పెట్టమని ప్రియ బతిమలాడుతుంది కానీ రాజ్యలక్ష్మి పోయిన తన పరువు ఇవ్వమని ప్రియ గొంతు పట్టుకుంటుంది. దివ్యని చూసుకునే కదా నీకు ఈ పొగరు దానికి తగిన శిక్ష వేస్తాను దాని జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తుంది. ప్రియ దగ్గరున్న ఫోన్ కూడా లాగేసుకుంటుంది. నందుకి తెలియకుండా లాస్య తన దగ్గరున్న డబ్బుని పద్మ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది. దివ్య బొకే చూస్తూ ప్రేమ భాష మాట్లాడుతుంది. నువ్వు పంపిన రోజా పూలు తెగ కవ్వించేస్తున్నాయని తనలో తనే మాట్లాడుకుంటుంది. అటు విక్రమ్ కూడా దివ్య ఫోటో చూసుకుంటూ మాట్లాడుకుంటాడు. పూజారి చెప్పిన ప్రకారం ప్రియ అమ్మవారికి 101 బిందెలతో అభిషేకం చేస్తుంది. 101 రోజులు 101 బిందెలు చాలు నీ రోజులు చెల్లిపోవడానికని రాజ్యలక్ష్మి అనుకుంటుంది. ప్రియ తనని అత్తయ్య అని పిలిచినప్పుడల్లా రగిలిపోతుంది. అప్పుడే విక్రమ్ ఇంటికి వస్తాడు. ప్రియని చూసి హాస్పిటల్ లో పని చేసే నర్స్ వి కదా ఇక్కడ ఉన్నావ్ ఏంటని అడుగుతాడు.
Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!
మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!
Mentoo Movie: ఓటీటీలోకి ‘మెన్ టూ’ మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అవికా గోర్ '1920 హారర్ ఆఫ్ ది హార్ట్' ట్రైలర్ చూశారా - వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !