అన్వేషించండి

Ennenno Janmalabandham March 31st: గుండెల్ని పిండేసే సీన్, ఖైలాష్ పంపిన ఫోటోస్ చూసేసిన యష్- వేద తన తప్పులేదని నిరూపించుకుంటుందా?

వేద విన్నీ కి ఐలవ్యూ చెప్పడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే

యష్ కి ఐలవ్యూ చెప్పి ఒకరికొకరు పూలదండలు మార్చుకున్నట్టు వేద ఊహించుకుంటుంది. తనకి వచ్చిన కొరియర్ ని యష్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో విన్నీ, వేద కలిసి ఒకరి మీద మరొకరు ఉన్నట్టు ఫోటోస్ ఉంటాయి. అవి చూసి యష్ రగిలిపోతాడు. గతంలో విన్నీ తన మనసులో మాటలు బయట పెట్టిన విషయాలు గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. వసంత్ వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నారు రమ్మని పిలుస్తాడు. యష్ కోపంగా ఎప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలుసని కోపంగా అంటాడు. వేద వదినకి ప్రపోజల్ చేస్తానని చెప్పావ్ కదా అవన్నీ జరుగుతాయి కదా మళ్ళీ ఏం మారలేదు కదా అంటే అన్నీ చెప్పినట్టే చేస్తానని యష్ చెప్తాడు. వేద విన్నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చి తనని పట్టుకుని గిరాగిరా తిప్పేస్తుంది.

Also Read: కావ్యకి సారీ చెప్పిన రాజ్- బయటపడిన అపర్ణ దాష్టీకం, కన్ఫ్యూజన్ లో రుద్రాణి

ఇది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. మనం ఒకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ మీద ప్రేమ పుట్టి అది వాళ్ళకి చెప్పడమే ఒక అద్భుతమైన ఫీలింగ్ కదా. అలాంటిది తనే తిరిగి మనల్ని ప్రేమించ బోతున్నాడని తెలిస్తే ఎంత బాగుంటుందో కదా. ఆయన నన్ను ప్రేమించాలని చెప్పాలని అనుకుంటున్నారని వేద సంతోషంగా చెప్తుంది. ఇక నుంచి నాకు ఆయనే లోకం, తనే సర్వస్వం అని మురిసిపోతుంది. అటు యష్ చాలా బాధగా వస్తూ ఉంటాడు. ఇప్పటి దాకా మా ఇద్దరి రిలేషన్ షిప్ ఒకటి ఇక మీద ఒకటి. ఇప్పటి నుంచి మేము ఒక్కరం. దీనంతటికీ కారణం నువ్వు ఇచ్చిన గిఫ్ట్. ఆయన ఆ పెయింటింగ్ చూసి ఎంత హ్యపీగా ఉన్నారో తెలుసా? ఆయన మనసులో ఇష్టాన్ని బయట పెట్టింది నువ్వు ఇచ్చిన పెయింటింగ్ అని వేద అంటుంది. నేను వచ్చింది, ఉన్నది నీ కోసమని విన్నీ అంటాడు.

నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండటం చాలా లక్కీ ఐ లవ్యూ విన్నీ ఐ లవ్యూ సొ మచ్ అని వేద విన్నీని హగ్ చేసుకోవడం యష్ చూస్తాడు. అది చూసి యష్ గుండె ముక్కలవుతుంది. అసలు నువ్వు ఎందుకు ముందే రాలేదు. నువ్వు వచ్చి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది. నువ్వు చాలా గ్రేట్. నువ్వు ముందే వచ్చి ఉంటే నా లైఫ్ ఒక మధురానుభూతిగా ఉండేది. ప్రతిరోజు సంతోషంగా ఉంచేవాడివి. నేనంటే ఇంత ఇష్టమని నాకోసం ఏమైనా చేస్తావా? నువ్వు నా లైఫ్ లోకి రావడం నిజంగా నా అదృష్టం. హర్ట్ ఫుల్ గా చెప్తున్న లవ్యూ లవ్యూ సో మచ్ అంటుంది. ఆ సీన్ లో యష్ బాధ గుండెల్ని మెలిపెట్టేస్తుంది. గతంలో మాళవిక అభిమన్యుని కౌగలించుకున్న సీన్ అన్నింటినీ గుర్తు చేసుకుంటాడు. నువ్వు నా ఫ్రెండ్ గా ఉండటం చాలా గ్రేట్ అని అంటుంది. నీకు ప్రమోషన్ ఇచ్చేస్తున్నా బెస్ట్ వెల్ విషర్ వి అంటుంది.

Also Read: ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దామన్న యష్- విన్నీ కుట్రతో మళ్ళీ మొదటికొచ్చిన వేద జీవితం

స్టేజ్ దగ్గర అందరూ యష్ కోసం ఎదురుచూస్తుంటే అప్పుడే వస్తాడు. ఖుషి ఇద్దరికీ పూల దండలు ఇస్తుంది. వేద యష్ మెడలో పూలమాల వేస్తుంది. అందరూ సంతోషంగా చప్పట్లు కొడతారు. కానీ యష్ మాత్రం వేద విన్నీకి లవ్యూ చెప్పింది గుర్తు చేసుకుని బాధగా తన మెడలో ఉన్న మాల తీసేస్తాడు. దీంతో వేద షాక్ అవుతుంది. ఏం మాట్లాడకుండా యష్ వెళ్లిపోతుంటే వేద పిలిచి ఏమైందని అడుగుతుంది. ఈ జర్నీ ఇంతటితో ఆపేద్దాము వేద అనేసరికి అందరూ షాక్ అవుతారు. వేద మనసు ముక్కలవుతుంది. లోపల ఒకటి బయటకి ఒకటి పెట్టుకుని మాట్లాడటం నాకు రాదు. ఏ రిలేషన్ షిప్ లో అయినా నమ్మకం ఉండాలని చెప్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget